Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఎలక్షన్ కమిషన్ వార్తలు

బ్రేకింగ్ న్యూస్: ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి బదిలీ

ఇద్దరు డీఎస్పీలపై ఈసీ వేటు

  • ఏపీలో అత్యంత కీలక పరిణామం
  • ఎన్నికల ముంగిట ఏకంగా డీజీపీపై బదిలీ వేటు
  • వెంటనే విధుల నుంచి రిలీవ్ కావాలంటూ ఈసీ ఆదేశాలు
  • రేపు ఉదయం 11 గంటల్లోపు ముగ్గురు డీజీ ర్యాంకు అధికారుల జాబితా పంపాలన్న ఈసీ

ఏపీలో ఎన్నికలు మరో 8 రోజుల్లో జరగనున్న నేపథ్యంలో, నేడు అత్యంత కీలక పరిణామం చోటుచేసుకుంది. ఏపీ డీజీపీ కె.రాజేంద్రనాథ్ రెడ్డిని ఎన్నికల సంఘం బదిలీ చేసింది. విపక్షాల  ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకున్న ఈసీ… ఈ మేరకు చర్యలు తీసుకుంది. విధుల నుంచి తక్షణమే రిలీవ్ కావాలని డీజీపీని ఆదేశించింది. రాజేంద్రనాథ్ రెడ్డికి ఎన్నికల విధులు కేటాయించకూడదని ప్రభుత్వానికి ఈసీ స్పష్టం చేసింది. కింది ర్యాంకు అధికారికి బాధ్యతలు అప్పగించాలని తన ఆదేశాల్లో పేర్కొంది. తదుపరి డీజీపీ నియామకం కోసం ముగ్గురు డీజీ ర్యాంకు అధికారుల జాబితాను రేపు ఉదయం 11 గంటల లోపు పంపాలని ప్రభుత్వాన్ని కోరింది.

ఇద్దరు డీఎస్పీలపై ఈసీ వేటు

  • టీడీపీ ఫిర్యాదుతో ఎన్నికల సంఘం చర్యలు
  • అనంతపురం టౌన్ డీఎస్పీ వీరరాఘవరెడ్డి బదిలీ
  • రాయచోటి డీఎస్పీ సయ్యద్ మహబూబ్ బాషా పైనా వేటు
Ananthapuram Town DSP Transffered by Election Commission

ఆంధ్రప్రదేశ్ లో ఇద్దరు డీఎస్పీలపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంది. వివాదాస్పద అధికారులను బదిలీ చేస్తూ ఆదివారం ఆదేశాలు జారీ చేసింది. అనంతపురం టౌన్ డీఎస్పీ వీరరాఘవరెడ్డి, రాయచోటి డీఎస్పీ సయ్యద్ మహబూబ్ బాషాలను బదిలీ చేసింది. టీడీపీ నేతల ఫిర్యాదుపై విచారణ జరిపిన ఈసీ తాజాగా చర్యలు తీసుకుంది. అనంతపురం టౌన్ లో తమ పార్టీ నేతలపై అక్రమ కేసులు బనాయించారని టీడీపీ ఆరోపించింది. వైసీపీ అధికారంలోకి వచ్చాక గత మూడేళ్లుగా అనంతపురం టౌన్ లో వీరరాఘవరెడ్డి తమ నేతలను వేధింపులకు గురిచేస్తున్నారని మండిపడింది.

నాన్ బెయిలబుల్ కేసులు పెడుతూ టీడీపీ జిల్లా నేతలను జైలు పాలు చేశారని ఆరోపించింది. ఇటీవల టీడీపీ నేతపై రౌడీషీట్ ఓపెన్ చేశారు. దీనిపై టీడీపీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదుపై విచారణ చేపట్టిన ఎన్నికల సంఘం.. డీఎస్పీ వీరరాఘవరెడ్డిపై వేటు వేసింది. అదేవిధంగా అన్నమయ్య జిల్లా రాయచోటీ డీఎస్పీ సయ్యద్ మహబూబ్ బాషా పైనా వేటు వేసింది. ఈ ఇద్దరు అధికారులను వెంటనే బాధ్యతల నుంచి తప్పుకోవాలని ఆదేశించింది. తమ సబార్డినేట్స్ కు ఛార్జ్ అప్పగించి విధుల నుంచి రిలీవ్ కావాలని డీజీపీ మెమోరాండం రిలీజ్ చేశారు.

Related posts

దేశంలో ముగిసిన రెండో దశ ఎన్నికల పోలింగ్..!

Ram Narayana

ఇది ఏపీ పోలింగ్ లెక్క …మొత్తం 81 .86 శాతం నమోదు …గ‌త కంటే 2.09 శాతం అధికం …

Ram Narayana

ఏపీలో హింసపై ఈసీ సీరియస్… పల్నాడు, అనంతపురం ఎస్పీలపై సస్పెన్షన్ వేటు… తిరుపతి ఎస్పీ బదిలీ…

Ram Narayana

Leave a Comment