-ఇలాంటివి సమాజానికి పెను ముప్పుని ఆందోళన
▪️గత కొంత కాలంగా తనపైన అసత్య ప్రచారం చేస్తున్నారు.▪️గత ఎన్నికల్లో కూడా ఇలానే చేశారు..
▪️కృత్రిమ మేధస్సు తో పొంచి ఉన్న ప్రమాదం.
డీప్‌ఫేక్ ఆడియోలు సమాజానికి పెను ముప్పుగా మారుతున్నాయని ఇవి సమాజంలో గందరగోళానికి కారణమవుతున్నాయి అని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు ఆందోళన వ్యక్తం చేశారు…గత కొంత కాలంగా తనపైన అసత్య ప్రచారం చేస్తున్నారని, గత ఎన్నికల తరుణంలో కూడా ఇదే మాదిరిగా.. ఇప్పుడు కూడా కొందరు ఆగంతకులు తను మాట్లాడినట్టుగా ఓ డీప్‌ఫేక్ ఆడియోను సృష్టించారని ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
ఈ విధమైన జరుగుతున్న దుష్ప్రచారం చేసే వారిపై చట్టపరమైన న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు…ఇటువంటి డీప్‌ఫేక్ ఆడియోలపై ప్రజలకు మీడియా వారు అవగాహన కల్పించాలని కానీ కొన్ని దినపత్రికలు దురుద్దేశపూర్వకంగా వాటిని ప్రజల్లో నిజం అని మైమరిపించేలా తప్పుడు ప్రచురణ చేస్తున్నారని దీన్ని పువ్వాడ తీవ్రంగా ఖండించారు.
వీటిని సృష్టించడానికి కృత్రిమ మేధను ఉపయోగించడం ద్వారా ప్రమాదం పొంచి ఉన్నదని, సమస్యాత్మకమని, దీనిపై ప్రజలకు అవగాహన కల్పించాలని మీడియాను మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కోరారు.