ఖమ్మం వార్తలు

కాంగ్రెస్ అభ్యర్థి త్రిబుల్ ఆర్ కు మద్దతుగా సినీ హీరో వెంకటేష్ ఖమ్మంలో రోడ్ షో !

  • సింగిల్ హ్యాండ్ కి ఓటు వేయండి
  • ఆర్ఆర్ఆర్ ని గెలిపించండి
  • కమాన్ ఖమ్మం అంటూ వెంకీమామ సందడి…
  • ర్యాలీలో పాల్గొన్న మంత్రి పొంగులేటి, ఎంపీ రేణుకా చౌదరి,తుమ్మల తనయుడు యుగంధర్
    -భారీగా తరలి వచ్చిన ప్రజలు …
  • మంగళవారం సాయంత్రం సినీహీరో వెంకటేష్ తన వియ్యంకుడు రామసహాయం రఘురాంరెడ్డికి మద్దతుగా ఖమ్మం లో… అమ్మా…. అక్క… బాబూ.. తాతా… చెల్లి…. తమ్ముడూ ఈవీఎంలో మూడో నెంబర్ “గుర్తుం”దా…! అదేనండి మన హస్తం గుర్తు. మే 13వ తేదీ జరిగే ఎన్నికల్లో మన ఆర్ఆర్ఆర్ కి ఓటు వేసి గెలిపించండి అంటూ వెంకటేష్ పేర్కొనడంతో ప్రజల నుంచి కేరింతలు వచ్చాయి… ఖమ్మంలోని మయూరి సెంటర్ నుంచి పాత బస్టాండ్, జెడ్పీసెంటర్, పాత కలెక్టరేట్ మీదుగా ఇల్లందు క్రాస్ రోడ్ వరకు రామసహాయం రఘురాం రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ రోడ్ షో నిర్వహించారు. మంత్రి పొంగులేటి, ఎంపీ రేణుకా చౌదరి, అభ్యర్థి ఆర్ఆర్ఆర్ పాల్గొన్న ఈ రోడ్ షోలో వెంకటేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే…! అక్కడ భద్రాచలంలో శ్రీ రాముడు… ఇక్కడ ఖమ్మంలో రఘురాముడు… అలాంటి రఘురాముడికి ఓటువేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలి. అందరికీ “గుర్తుం”ది…! కదా…మే 13..! ఆ రోజు ఈవీఎంలో మూడో నెంబర్ హస్తం గుర్తుకు వేయండి. ఓటు వేయడం మన బాధ్యత… మన హక్కు…. అంటూ తన ప్రసంగాన్ని ముగించారు.
  • ఎనీ టైం… ఎనీ సెంటర్ అంటూ వెంకీ మామ సందడి

ఎనీ టైం … ఎనీ సెంటర్… సింగిల్ హ్యాండ్ రఘురాముడు… ఖమ్మం… ఖమ్మం… ఖమ్మం…. కమాన్ అంటూ సినీ హీరో వెంకీ మామ నగరంలో సందడి చేశారు. మయూరి సెంటర్ నుంచి ఇల్లందు క్రాస్ రోడ్ వరకు జరిగిన రోడ్ షో లో ఖమ్మం ప్రజానీకం వెంకటేష్ ను చూసేందుకు ఉత్సాహకత చూపారు. సుమారు రెండు గంటల పాటు జరిగిన రోడ్ షో ఆద్యంతం ఖమ్మం ప్రజానీకాన్ని అలరించింది. అడుగడుగునా వెంకటేష్ కు నీరా’జనం’ పలికారు. అభివాదం చేస్తూ… హస్తం గుర్తుకు ఓటు వేసి ఆర్ఆర్ఆర్ ను గెలిపించాలని కోరుతూ ముందుకు సాగారు.

Related posts

కాంగ్రెస్ ను తరమాలి…పక్కా లోకలైన నామను గెలిపించుకోవాలి

Ram Narayana

ఖమ్మం మున్నేరు వరద ప్రభావిత ప్రాంతాల్లో SBI మొబైల్ ATM బ్యాంకింగ్ సేవలు..

Ram Narayana

అర్జీల పరిష్కారం సత్వరమే చేయాలి …. జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్

Ram Narayana