తెలంగాణ వార్తలు

రైతు భరోసాపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ప్రకటన…!

ఆధైర్యపడ్డోద్దు,ఇది రైతు ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హామీ ఇచ్చారు …బుధవారం జిల్లా కాంగ్రెస్ కార్యాలయం సంజీవరెడ్డి భవన్ లో జరిగిన కాంగ్రెస్ కిషన్ సమ్మేళనంలో ఆయన పాల్గొని ప్రసంగిస్తూ రైతులకు అండగా ఈ ప్రభుత్వం ఉంటుంది …నిన్నమొన్న కురిసిన వర్షాలకు కూడా పంట నష్టపరిహారం ఇప్పిస్తాం అందుకు అధికారులంతో ఎన్యూమరేషన్ చేయిస్తామని అన్నారు ..ఇది మీ ప్రభుత్వం రైతుల ప్రభుత్వం అని పేర్కొన్నారు …రైతుల కష్టాల్లో పాలు పంచుకుంటాం వారికీ ఇకపై ప్రభుత్వమే ఇన్సూరెన్స్ చేయిస్తందని తెలిపారు .. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి వాగ్దానానికి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉందని రైతులకు ఎకరాకు 15 వేల రైతు భరోసా ఇస్తామని అర్హులను గుర్తిస్తామని స్పష్టం చేశారు .. అదే విధంగా రైతులకు రూ 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని ఇది తమ వాగ్దానమని అన్నారు… ఆగస్టు 15 లోపు రుణమాఫీ జరుగుతుందని చెప్పారు .

ఇది రైతు ప్రభుత్వం…. రైతుల కు అండగా ఉంటుంది….ఆకాల వర్షానికి తడిసిన ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేయాలని అధికారులను ఆదేశించడం జరిగిందని తెలిపారు …
రోబోయే బడ్జెట్ సమావేశం తరువాత రైతులకు ఇచ్చిన హామీ రైతు భరోసా కింద 15 వేల రూపాయలు ఇస్తామని అన్నారు …రైతులు రోడ్డుపై విత్తనాలు , ఎరువుల కోసం క్యూ లైన్ లో నిలబడే పరిస్థితి రాకుండా చేస్తామన్నారు …పంటలు గిట్టుబాటు ధరలు వచ్చే విధంగా కేంద్రంతో చర్చిస్తామని అన్నారు …ఎరువులు ,విత్తనాలు సకాలంలో అందేలా చర్యలు తీసుకుంటామని తుమ్మల పేర్కొన్నారు …ఈ సమావేశంలో రైతు సంఘం, జిల్లా కాంగ్రెస్ నాయకులూ పాల్గొన్నారు …

Related posts

హరీశ్ రావుకు తెలంగాణలోనే అత్యధిక మెజారిటీ వస్తుందన్న ‘ఆరా’ సంస్థ

Ram Narayana

 అప్పు తీసుకుని ముఖం చాటేసిన స్నేహితులు.. కరీంనగర్ లో వైద్యుడి ఆత్మహత్య

Ram Narayana

తెలంగాణ సెక్రటేరియట్ లో ఇద్దరు నకిలీ ఉద్యోగులు!

Ram Narayana