Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఖమ్మం వార్తలు

నామ గెలుపుకోసం ఎంపీ వద్దిరాజు బురహాన్ పురంలో విస్త్రత ప్రచారం…

రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర బీఆర్ఎస్ ఖమ్మం లోకసభ నియోజకవర్గ అభ్యర్థి నామ నాగేశ్వరరావుకు ఘన విజయం చేకూర్చేందుకు విస్త్రత ప్రచారం నిర్వహిస్తున్నారు

ప్రచారంలో భాగంగా ఎంపీ రవిచంద్ర ఖమ్మం బురహాన్ పురం బుధవారం ఉదయం కాలినడకన గడపగడపకు వెళ్లి మహానేత కేసీఆర్ నాయకత్వానికి సంపూర్ణ మద్దతు ఇవ్వాల్సిన,నాగేశ్వరరావును గెలిపించాల్సిన అవసరం గురించి వివరించారు

మొదట బురహాన్ పురంలోని శ్రీభక్తాంజనేయ స్వామి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం 51,52 డివిజన్లలో గులాబీ కండువాలు మెడలో వేసుకుని, కరపత్రాలు, నమూనా ఈవీఏం చేతబట్టుకుని డప్పుల దరువు మధ్య కాలినడకన వీధివీధిలో ఇల్లిల్లు తిరిగి ప్రచారం నిర్వహించారు …

ఈ సందర్భంగా “జై తెలంగాణ జైజై తెలంగాణ”,”వర్థిల్లాలి వర్థిల్లాలి కేసీఆర్ నాయకత్వం వర్ధిల్లాలి”,” జిందాబాద్ జిందాబాద్ బీఆర్ఎస్ జిందాబాద్”,” కారు గుర్తుకే మన ఓటు”,” గెలిపిద్దాం గెలిపిద్దాం బీఆర్ఎస్ అభ్యర్థి నామ నాగేశ్వరరావును భారీ ఓట్ల మెజారిటీతో గెలిపిద్దాం”అనే నినాదాలు బురహాన్ పురంలో హోరెత్తాయి

“కేసీఆర్ గారి పాలనయే బాగుంది, రేవంత్ రెడ్డికి కేసీఆర్ కు ఏ మాత్రం పోలికనే లేదు.కాంగ్రెస్ వచ్చింది కష్టాలు మొదలైనయ్, కరెంట్ పోతున్నది, మంచినీళ్లు కూడా రావట్లే,బోర్లు కూడా ఎండిపోయినయ్” అని ఎంపీ రవిచంద్ర ముందు ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఎంపీ వద్దిరాజు స్పందిస్తూ ప్రతిరోజు ట్యాంకర్ల ద్వారా మంచినీళ్లు సరఫరా చేయిస్తానని హామీనిచ్చారు

ప్రచారం సందర్భంగా ఎంపీ రవిచంద్ర ఎదురుపడగా ధనమ్మ అనే వృద్ధురాలు మాట్లాడుతూ
“కేసీఆర్ దయతోనే నాకు 2వేల పింఛన్ వస్తున్నదని, అప్పుడు నెలానెల తప్పకుండా వచ్చేవి.ఇప్పుడు ఎప్పుడొస్తయో,అసలు వస్తయో రావో తెల్వకుండా ఉన్నది.రెండు నెలల పింఛన్ రాలే, రేవంత్ రెడ్డి ఎగ్గొట్టిండు” అని వాపోయింది.”నా ఓటు,నా కుటుంబ సభ్యుల ఓట్లు కేసీఆర్ కే వేస్తామని స్పష్టం చేశారు”

ఎంపీ రవిచంద్ర వాడవాడలా కలియతిరిగి బీఆర్ఎస్ సీనియర్ నాయకులు శీలంశెట్టి వీరభద్రం,పొన్నం వెంకటేశ్వర్లు, కార్పోరేటర్లు శీలంశెట్టి రమాదేవి, బుర్రి వెంకట్ తదితరులతో కలిసి గడపగడపకు వెళ్లి కరపత్రాలు పంచుతూ కారు గుర్తుకు ఓటేసి బీఆర్ఎస్ అభ్యర్థి నామ నాగేశ్వరరావుకు ఘన విజయం చేకూర్చాల్సిందిగా విజ్ఞప్తి చేశారు

కాంగ్రెస్ పాలన పట్ల ప్రజలు చాలా కోపంగా ఉన్నారని తిరిగి కేసీఆర్ పాలన కావాలని కోరుకుంటున్నారని అన్నారు .. కాంగ్రెస్ వచ్చిన తర్వాత తమకు కష్టాలు మొదలైయ్యాయని ప్రజలు వాపోతున్నారని అన్నారు …కాంగ్రెస్ వచ్చింది కరెంట్ పోయింది, తాగేందుకు నీళ్లు కూడా దొరకడం లేదని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని తెలిపారు …కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు,432హామీలిచ్చి అధికారంలోకి రాగానే పాలకులు పచ్చి అబద్ధాలు ఆడుతున్నరు
పంట పెట్టుబడి కింద రైతుభరోసా పేరిట 10వేల నుంచి 15వేలకు పెంచి ఇస్తామన్న హామీ ఉత్తిదే అయ్యిందన్నారు ..సాగునీళ్లు లేక పంటలు ఎండిపోయినయ్,పండిన కొద్ది పంటలను కూడా కొనుగోలు చేయడం లేదు ..వరి క్వింటాలుకు 500బోనస్ మాటే మర్చిపోయారు
కళ్యాణలక్ష్మీ లేదు,తులం బంగారం హామీని నెరవేర్చే పరిస్థితి లేదు .సీఎంఆర్ఎఫ్,ఎల్వోసీల మాటే లేదు,ఇచ్చిన చెక్కులు కూడా పాస్ కావడం లేదు ..అలవికాని హామీలిచ్చి తమను మోసం చేశారని ప్రజలు గుర్తించారు …కాంగ్రెస్ పాలకులకు తగిన బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నరు …తన పాదయాత్రకు, ఇంటింటా ప్రచారానికి అనూహ్య స్పందన వచ్చింది
కరెంట్ కోతలు,నీళ్ల కటకట గురించి మహిళలు తాము పడుతున్న బాధల గురించి వివరించారు… తెలంగాణ ప్రజల న్యాయమైన హక్కుల సాధనకు, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను చక్కగా వివరించడం జరిగింది
ఖమ్మం జిల్లా ప్రజలు చైతన్యవంతులు,ఇక్కడ నామ నాగేశ్వరరావు, మహబూబాబాద్ నియోజకవర్గంలో మాలోతు కవిత ఘన విజయం సాధించడం ఖాయమని వద్దిరాజు జోష్యం చెప్పారు….

Related posts

ఖమ్మం ఫలితంపై నామ విశ్వాసం …ఫలితం అనూహ్యంగా ఉంటుందని ధీమా..!

Ram Narayana

రాహుల్ గాంధీని ప్రధాని చేసుకుందాం…మంత్రి పొంగులేటి …

Ram Narayana

పాలేరు గడ్డపై పొంగులేటి విజయగర్జన …పాలేరు గ్రామం నుంచి ప్రచారం ప్రారంభం …!

Ram Narayana

Leave a Comment