Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

ఖమ్మం లోకసభ సాధారణ ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు …ఆర్ ఓ విపి గౌతమ్

లోకసభ సాధారణ ఎన్నికలను పురస్కరించుకొని ఈనెల 13వ తేదీన పోలింగ్ కోసం పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. శనివారం నూతన కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తో కలిసి, ఎన్నికల ఏర్పాట్లు, సైలెన్స్ పీరియడ్ పై మీడియా, రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రిటర్నింగ్ అధికారి మాట్లాడుతూ, కేంద్ర ఎన్నికల కమీషన్ పోలింగ్ సమయం ఒక గంట పొడిగించిందని, ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ఓటు వేయవచ్చని అన్నారు. ఖమ్మం పార్లమెంట్ పరిథిలో మొత్తం 7 అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించి 1896 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 7 అసెంబ్లీ సెగ్మెంట్లకు కలిపి మొత్తం 16 లక్షల 31 వేల 39 మంది ఓటర్లు ఉన్నారని, వీరిలో 7 లక్షల 87 వేల 160 మంది పురుషులు, 8 లక్షల 43 వేల 749 మంది స్త్రీలు, 130 మంది ట్రాన్సజెండర్లు ఉన్నారన్నారు. 30,389 మంది దివ్యాంగులు, 10,318 మంది సీనియర్ సిటీజేన్స్ ఉన్నారని తెలిపారు. ప్రశాంత వాతావరణంలో పారదర్శకమైన ఎన్నికల నిర్వహణకు 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో 27 ఎఫ్ఎస్టీ, 21 ఎస్ఎస్టీ, 31 ఎంసిసి బృందాలు, 203 మంది సెక్టార్ అధికారులు, 6 రాష్ట్ర సరిహద్దు చెక్ పోస్టులు ఏర్పాటుచేసినట్లు, వీటికి అదనంగా 5 ఎఫ్ఎస్టీ టీములు శుక్రవారం నుండి నిఘాకు వుంచినట్లు ఆయన తెలిపారు. పోలింగ్ కేంద్రాలకు వచ్చే సినియర్ సిటిజెన్స్, దివ్యాంగులకు పోలింగ్ కేంద్రాలలో వసతులు కల్పించడం జరిగిందని, వారికి ప్రత్యేక క్యూలైన్ ఏర్పాటుతో ఓటింగ్ కొరకు పోలింగ్ కేంద్రానికి రావడానికి రవాణా సౌకర్యం కల్పిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇట్టి రవాణా సౌకర్యానికి సాక్ష్యం యాప్ ద్వారా దరఖాస్తు చేయాలని, ఇప్పటికి 15 వేల మంది దరఖాస్తు చేసినట్లు ఆయన అన్నారు. పోలింగ్ రోజున సెక్టార్ అధికారులతో పాటు పోలీసు ఎస్కార్ట్ తో డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుండి పోలింగ్ కేంద్రాలకు తీసుకెళ్లడం జరుగుతుందని, అలాగే సెక్టార్ ఆఫీసర్ల వద్ద 2 చొప్పున రిజర్వు ఇవిఎం యంత్రాలను అందుబాటులో ఉంచినట్లు, ఎక్కడైనా సమస్య వస్తే రిజర్వు ఇవిఎం యంత్రాలను వాడడం జరుగుతుందని తెలిపారు. ఖమ్మం, పాలేరు అసెంబ్లీ సెగ్మెంటులకు సంబంధించి ఖమ్మం రూరల్ మండలం పొన్నెకల్ గ్రామంలోని శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కళాశాలలో, మధిర అసెంబ్లీ సెగ్మెంటుకు సంబంధించి మధిరలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో, వైరా అసెంబ్లీ సెగ్మెంట్ సంబంధించి సాంఘీక సంక్షేమ బాలికల రెసిడెన్షియల్ పాఠశాల, కళాశాలలో, సత్తుపల్లి అసెంబ్లీ సెగ్మెంట్ సంబంధించి సత్తుపల్లి లోని జ్యోతి నిలయం హైస్కూల్ లో, కొత్తగూడెం అసెంబ్లీ సెగ్మెంట్ కు సంబంధించి రామచంద్ర ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో, అశ్వారావుపేట అసెంబ్లీ సెగ్మెంట్ కు సంబంధించి అశ్వారావుపేట లోని వ్యవసాయ కళాశాలలో ఇవిఎం స్ట్రాంగ్ రూములు ఏర్పాటు చేయడం జరిగిందని, మొత్తం పార్లమెంట్ నియోజక వర్గానికి సంబంధించి ఖమ్మం రూరల్ మండలం పొన్నెకల్ లోని శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కళాశాలలో కౌంటింగ్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఇవిఎం యంత్రాలకు సంబంధించి కమీషనింగ్ చేసి సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. పోలింగ్ విధుల పట్ల ప్రిసైడింగ్ ఆఫీసర్లకు శిక్షణ ఇవ్వడం జరిగిందని, 7-ఏ ద్వారా పోలింగ్ కేంద్రం బయట అభ్యర్ధుల లిస్ట్, 12 రకాల గుర్తింపు కార్డుల వివరాలు, పోలింగ్ కేంద్రంలో చేయదగినవి, చేయకూడని వివరాలను ప్రదర్శిస్తారని తెలిపారు. ఓటర్లకు ఓటరు ఇన్పర్మేషన్ స్లిప్ ల పంపిణీ పూర్తి చేసినట్లు ఆయన అన్నారు. ఇట్టి స్లిప్ లో వారి పోలింగ్ కేంద్రం పేరు, సంఖ్య, వారి ఓటరు వరుస సంఖ్య, ఓటరు గైడ్ ఉంటాయని, అవి ఓటరుకు సహాయకారిగా ఉంటాయని, జిల్లాలో ఇప్పటి వరకు 98 శాతం స్లిప్పులు ఇంటింటికి తిరిగి పంపిణీ చేశారని, పంపిణీ కాక మిగిలిన వాటిని ఎ.ఎస్.డి. జాబితా తయారుచేసి, సంబంధిత పోలింగ్ కేంద్రాలకు అందజేయడం జరిగిందని అన్నారు. పోస్టల్ బ్యాలెట్ లో భాగంగా హోమ్ ఓటింగ్ సంబంధించి 2728 మంది ఓటు వేయడం జరిగిందన్నారు. ఇప్పటి వరకు 86 లక్షల, 26 వేల రూపాయల విలువ గల బహుమతులు, రూ. 3 కోట్ల 47 లక్షల 31 వేల నగదు, రూ. ఒక కోటి 6 లక్షల 40వేల విలువ గల లిక్కర్, రూ. 24 లక్షల 39 వేల విలువ గల గంజాయి సీజ్ చేయడం జరిగిందని తెలిపారు. సీ విజిల్, 1950 ద్వారా వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరిస్తున్నామని, పోలింగ్ పూర్తి అయ్యేంత వరకు వచ్చే ఫిర్యాదులను పరిశీలిస్తామని ఆయన అన్నారు. పోలింగ్ కు 48 గంటల ముందు సైలెన్స్ పీరియడ్ గా పరిగణించి ప్రచార కార్యక్రమాలపై, లౌడ్ స్పీకర్లపై నిషేధం ఉంటుందని, 144 సెక్షన్ అమలులో ఉంటుందని తెలిపారు. అభ్యర్థికి ఒక వాహనం అనుమతితో పాటు నలుగురు వ్యక్తులకు అనుమతి ఉంటుందని తెలిపారు. పోలింగ్ కేంద్రం వంద మీటర్ల పరిథిలో ఎలాంటి ప్రచార కార్యక్రమాలు అయినా నిషేధమని, అలాగే ఒపీనియన్ పోల్, ఎగ్జిట్ పోల్ నిషేధించినట్లు, తెలిపారు. పోలింగ్ ముందు రోజు, పోలింగ్ రోజు డ్రైడేగా ప్రకటించడం జరిగిందని, 11 వ తేదీ సాయంత్రం 6.00 గంటల నుండి 13 వ తేదీ పోలింగ్ పూర్తయ్యేంత వరకు వైన్స్ షాప్స్, బార్లు బంద్ చేయడం జరుగుతుందని తెలిపారు. 12 వ తేదీన పోలింగ్ పార్టీలు డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల నుండి అన్ని రకాల మెటీరియల్ తీసుకొని పోలింగ్ కేంద్రాలకు వెళ్లే విధంగా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలిపారు. పోలింగ్ రోజున సాయంత్రం 6.00 గంటల లోపు పోలింగ్ కేంద్రం లోపలికి వచ్చిన వారికి చివరి నుండి స్లిప్పులు ఇచ్చి పోలింగ్ పూర్తి చేయడం జరుగుతుందని తెలిపారు. ఓటింగ్ శాతం పెరగడానికి స్వీప్ ప్రచార కార్యక్రమాలు చేపట్టామని, యువ ఓటర్లు ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని, వేసవి ఎండల దృష్ట్యా అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద నీడ, త్రాగునీటి సదుపాయం, టాయిలెట్స్, మెడికల్ కిట్, ఓఆర్ఎస్ ప్యాకెట్స్ తదితర వసతులు కల్పించడం జరిగిందని తెలిపారు. ఓటు వేయడం అందరి బాధ్యత అని, పారదర్శకమైన ఏర్పాట్లతో ప్రశాంత వాతావరణంలో అర్పత కలిగిన ప్రతి ఒక్కరూ తమ ఓటు వేయాలని, ఓటింగ్ శాతం పెరగడంలో సహకరించాలని మీడియా ముఖంగా విజప్తి చేస్తున్నట్లు ఆయన అన్నారు.

 ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ సునీల్ దత్ మాట్లాడుతూ, స్వేచ్ఛ, న్యాయబద్ద ఎన్నికల నిర్వహణకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. శనివారం సాయంత్రం 6 గంటల నుంచి సోమవారం పోలింగ్ ముగిసే వరకు వైన్స్, బార్ లు మూసివేయుటకు ఉత్తర్వులు ఇచ్చామన్నారు. బల్క్ ఎస్ఎంఎస్ లు దృష్టికి వస్తే సమాచారం ఇవ్వాలన్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో నిఘా పెట్టామన్నారు. జిల్లాకు సంబంధించి 1459 పోలింగ్ కేంద్రాలకు గాను 209 క్రిటికల్ పోలింగ్ కేంద్రాలు, 86 లోకేషన్లలో ఉన్నట్లు, ఈ కేంద్రాలలో సెంట్రల్ ఆర్మ్డ్ రిజర్వు ఫోర్సు నియమించామన్నారు.   కొత్త వారు, బయట వారు జిల్లాలో ఉంటే పంపిస్తామని అన్నారు. పోలింగ్ కు 48 గంటల ముందు సెలెన్స్ పీరియడ్లో 144 సెక్షన్ అమలులో ఉంటుందని, ఈ సందర్భంగా గోదాములు, ఫంక్షన్ హాల్సు, రిసార్ట్స్, ఫామ్ హౌజ్ లు తదితర చోట్ల నిఘా టీములు రైడ్స్ జరుపుతాయని, ప్రయివేటు పార్టీలకు అనుమతి లేదని, పోలింగ్ కేంద్రాలకు సెల్ ఫోన్లు అనుమతి లేదని ఆయన తెలిపారు. 2391 మంది పోలీసులు, 6 కంపెనీల సిఐపీఎఫ్ బలగాలు బందోబస్తు విధుల్లో ఉంటాయన్నారు. 20 ప్రత్యేక టీములని శాంతిభద్రతల, ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలుకు తక్షణ చర్యలకు ఏర్పాటు చేశామన్నారు. ప్రశాంత వాతావరణంలో పోలింగ్ కు అన్ని ఏర్పాట్లు చేశామని, అందరూ సహకరించాలని పోలీస్ కమిషనర్ అన్నారు.

Related posts

కొవిషీల్డ్ టీకాతో 80% తగ్గుతున్న కరోనా మరణాల ముప్పు!

Drukpadam

టైరు పేలి ప్రమాదం జరిగితే పరిహారం ఇవ్వాల్సిందే!: బాంబే హైకోర్టు తీర్పు!

Drukpadam

యూపీలో.కాలినగాయాలతోరోడ్డుపక్కన నగ్నంగా పడి ఉన్న కాలేజీ విద్యార్థిని

Drukpadam

Leave a Comment