ఖమ్మం పార్లమెంట్ పరిధిలో పోలింగ్ ప్రశాంతం… 70 శాతం పైగా పోలింగ్
పకడ్బందీ ఏర్పాట్ల మధ్య ఓటు హక్కు వినియోగించుకున్న ఓటర్లు
అక్కడక్కడా మొరాయించిన ఈవీఎంలు …
తిరుమలాయపాలెం మండలం మేడిదేపల్లిలో ఇరు వర్గాల ఘర్షణ ..ముగ్గురికి గాయాలు
పోలీసులు బందోబస్తు …
మధిరలో ఓటు హక్కు వినియోగించుకున్న డిప్యూటీ సీఎం భట్టి
ఖమ్మంలో ఓటు హక్కు వినియోగించుకున్న తుమ్మల ,ఎంపీలు వద్దిరాజు, నామ , మాజీ మంత్రి పువ్వాడ
స్వగ్రామం నారాయణపురంలో ఓటు హక్కు వినియోగించుకున్న మంత్రి పొంగులేటి , బీజేపీ నేత సుధాకర్ రెడ్డి
ఖమ్మం పార్లమెంట్ పరిధిలో ఈసాయంత్రం 6 గంటలకు జరిగిన పోలింగ్ చెదురు మదురు ఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసింది …ఇంకా ఎంత శాతం పోలింగ్ జరిగింది అనేది అధికారిక లెక్కలు తెలియనప్పటికీ 70 శాతం పైగా పోలైనట్లు సమాచారం …అయితే ఇది ఇంకా పెరిగే అవకాశం ఉంది …మొత్తం 7 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఉన్న ఖమ్మం పార్లమెంట్ , ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని మరో మూడు నియోజకవర్గాలైన ఇల్లందు , పినపాక , భద్రాచలం నియోజకవర్గాలు మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలో ఉన్నాయి…అక్కడ కూడా పోలింగ్ ప్రశాంతంగా జరిగింది …ఈ నియోజకవర్గాల్లో మావోయిస్టుల ప్రభావం ఉండటంతో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగిసింది …ఖమ్మంలో కాంగ్రెస్ అభ్యర్థి రామసహాయం రఘురాంరెడ్డి , బీఆర్ యస్ అభ్యర్థి నామ నాగేశ్వరరావు , బీజేపీ అభ్యర్థి తాండ్ర వినోదరావు ప్రధాన పోటీదార్లుగా ఉన్నారు …పోలింగ్ సరళిని భట్టి కాంగ్రెస్, బీఆర్ యస్ అభ్యర్థుల మధ్య పోటీకి జరిగింది …బీజేపీ అభ్యర్థికి గణనీయమైన ఓట్లు పోలైనట్లు తెలుస్తుంది … ఉదయం 7 గంటలకే పోలింగ్ ప్రారంభం కాగా కొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయించాయి…వెంటనే వాటిని సరిచేసి పోలింగ్ ప్రక్రియ ప్రారంభించారు …జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి విపి గౌతమ్ కలెక్టర్ కార్యాలయం నుంచి వెబ్ కాస్టింగ్ ద్వారా ఎన్నికల సరళని పరిశీలకులతో కలిసి పర్వేక్షించారు…
తిరుమలాయపాలెం మండల పరిధిలోని మేడేదేపల్లి గ్రామంలో పోలింగ్ కేంద్రాల వద్ద కాంగ్రెస్ , బిఆర్ఎస్ పార్టీల మధ్య ఘర్షణ జరిగింది… కాంగ్రెస్ పార్టీ నాయకులు చంద్రారెడ్డి వరిగడ్డి సాగర్, జయపాల్ రెడ్డి, షేక్ మహమ్మద్ భాష, వరుణ్, అనిల్ రెడ్డి, లకు తీవ్ర గాయాలు అయ్యాయి..వీరిని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆదేశాలమేరకు చికిత్స నిమిత్తం ఖమ్మంలోని ఒక ప్రవేట్ ఆసుపత్రికి తరలించారు .. కూసుమంచి సీఐ ఆధ్వరంలో తిర్మలాయపాలెం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు …
జిల్లాలో ఓటేసిన డిప్యూటీ సీఎం భట్టి ,మంత్రులు తుమ్మల , పొంగులేటి
డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క , మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు , పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలు జిల్లా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు …భట్టి తన సతీమణి నందిని , కుమారుడు సూర్య విక్రమాదిత్య లతో కలిసి మధిర సుందరయ్య నగర్ లో గల పోలింగ్ బూత్ లో ఓట్లు హక్కు వినియోగించుకున్నారు …అనంతరం మీడియా తో మాట్లాడారు …ప్రజాస్వామ్యం లో ఓటు వినియోగించుకొని తమకు నచ్చిన పార్టీని ఎన్నుకోవాలని కోరారు ..
రాష్ట్ర వ్యవసాయశాఖమంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం నియోజకవర్గ పరిధిలోని గొల్లగూడెం పోలింగ్ స్టేషన్ లో ఓటు హక్కు వినియోగించుకున్నారు … రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తన ఓటు హక్కును సత్తుపల్లి నియోజకవర్గంలోని తన స్వగ్రామైన నారాయణపురం వినియోగించుకున్నారు … జిల్లా కలెక్టర్ విపి గౌతమ్ దంపతులు జిల్లా ఫారెస్ట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో క్యూలైన్లో నిలబడి తన ఓటు హక్కు వినియోగించుకున్నారు … ఎంపీలు వద్దిరాజు రవిచంద్ర దంపతులు , నామ నాగేశ్వరరావు లు ,ఎమ్మెల్సీ తాతా మధు, ఎమ్మెల్యేలు,కూనంనేని సాంబశివరావు , రాందాస్ నాయక్ , డాక్టర్ మట్టా రాగమయి , జారే ఆదినారాయణ, కోరం కనకయ్య, పాయం వెంకటేశ్వర్లు , డాక్టర్ తెల్లం వెంకట్రావు , మాజీమంత్రి పువ్వాడ అజయ్ కుమార్ దంపతులు , పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి దంపతులు , సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య దంపతులు,మాజీఎమ్మెల్సీలు బాలసాని లక్ష్మినారాయణ , పోట్ల నాగేశ్వరరావు ,గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు , హోసింగ్ చైర్మన్ మువ్వా విజయబాబు ,నగర మేయర్ పూనుకొల్లు నీరజ తదితర ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకున్నవారిలో ఉన్నారు ..
ఖమ్మం రూరల్ మండలం బారుగూడెం పోలింగ్ బూతుకు తన జేజిని ఓటింగ్ కు తీసుకోని వెళుతున్న మునిమనమరాలు…