Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

ఏపీ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తిపై అనర్హత వేటు…

  • 1999, 2009లో కాంగ్రెస్ తరపున గురజాల ఎమ్మెల్యేగా గెలిచిన జంగా
  • 2014 ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేసి ఓటమిపాలైన వైనం
  • జంగాను ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ చేసిన వైసీపీ

ఏపీ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తిపై అనర్హత వేటు పడింది. ఆయనపై వేటు వేస్తూ శాసనమండలి ఛైర్మన్ మోషేన్ రాజు నిర్ణయం తీసుకున్నారు. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ఆధారంగా ఆయన అనర్హత వేటు వేశారు. వైసీపీ తరపున గెలిచిన జంగా కృష్ణమూర్తి టీడీపీలో చేరారు. దీంతో, ఆయనపై శాసనమండలి ఛైర్మన్ కు వైసీపీ ఫిర్యాదు చేసింది. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం విచారణ జరిపి, కృష్ణమూర్తిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరింది. ఈ క్రమంలో విచారణ జరిపిన మండలి ఛైర్మన్… చివరకు కృష్ణమూర్తిపై వేటు వేశారు.  

1999, 2009లో పల్నాడు జిల్లా గురజాల కాంగ్రెస్ ఎమ్మెల్యేగా కృష్ణమూర్తి గెలిచారు. అనంతరం వైసీపీలో చేరి 2014 ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత వైసీపీ ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అయ్యారు. వైసీపీలో ఉన్న సమయంలో విప్ గా కూడా పని చేశారు. ఎన్నికల ముందు ఆయన టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. వైసీపీని వీడక ముందే ఆయనను విప్ పదవి నుంచి తొలగించడం గమనార్హం.

తన ఎమ్మెల్సీ అభ్యర్థిత్వంపై వేటు వేయడంపై జంగా కృష్ణమూర్తి స్పందన

  • బీసీలను అణగదొక్కేలా వైసీపీ వ్యవహరించిందన్న కృష్ణమూర్తి
  • మండలి ఛైర్మన్ పై ఒత్తిడి చేశారని ఆరోపణ
  • ఎవరినైనా వాడుకుని వదిలేయడం వైసీపీ నైజమని విమర్శ

ఇటీవల టీడీపీలో చేరిన ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తిపై శాసనమండలి ఛైర్మన్ మోషేను రాజు అనర్హత వేటు వేసిన సంగతి తెలిసిందే. కృష్ణమూర్తిపై వేటు వేస్తూ నిన్న అర్ధరాత్రి గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. దీనిపై కృష్ణమూర్తి స్పందిస్తూ… తన వివరణ తీసుకోకుండానే వేటు వేశారని మండిపడ్డారు. ఎమ్మెల్సీ పదవి తనకు వ్యక్తిగతంగా వచ్చింది కాదని… బీసీ వర్గాలకు ఇచ్చిన పదవి అని చెప్పారు. వైసీపీ అధిష్ఠానం మండలి ఛైర్మన్ పై ఒత్తిడి తీసుకొచ్చి తనపై వేటు వేసేలా చేసిందని విమర్శించారు. బీసీల నాయకత్వాన్ని అణగదొక్కేలా వైసీపీ యత్నించిందని అన్నారు. ఎవరినైనా వాడుకుని వదిలేయడం వైసీపీ నైజమని దుయ్యబట్టారు. పార్టీ మారిన వల్లభనేని వంశీ, మద్దాలి గిరిపై రెండేళ్ల పాటు చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. 

వైసీపీ తరపున ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా గెలుపొందిన కృష్ణమూర్తి ఇటీవలే ఆ పార్టీని వీడి టీడీపీలో చేరారు. గతంలో ఆయన గురజాల నుంచి రెండు సార్లు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. పల్నాడు జిల్లాలో సీనియర్ రాజకీయ నేతగా ఆయనకు గుర్తింపు ఉంది.

Related posts

తెలంగాణ బీజేపీ నేతలతో నడ్డా సమావేశం… క్రమశిక్షణపై క్లాస్!

Drukpadam

యాసంగి సీజన్ లో సాగునీటి సరఫరాపై మంత్రి పువ్వాడ సమీక్ష…

Drukpadam

సుప్రీంకోర్టులో కల్వకుంట్ల కవితకు ఊరట

Ram Narayana

Leave a Comment