Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ వార్తలు

గ్రూప్-1 పరీక్ష.. అభ్యర్థులకు టీజీపీఎస్సీ కీలక సూచనలు…

  • జూన్ 9న గ్రూప్-1  ప్రిలిమినరీ పరీక్ష, పకడ్బందీ ఏర్పాట్లు  
  • అభ్యర్థుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో ఓఎమ్ఆర్ విధానంలోనే పరీక్ష నిర్వహణ
  • ఉదయం 10.30 నుంచి 1 గంట వరకూ పరీక్ష
  • 9.30 నుంచి అభ్యర్థుల బయోమెట్రిక్ సేకరణ
  • ఈ మేరకు అభ్యర్థులకు టీజీపీఎస్సీ కీలక సూచనలు

తెలంగాణలో 563 గ్రూప్ – 1 పోస్టుల భర్తీకి ప్రిలిమినరీ పరీక్ష నిర్వహణకు టీజీపీఎస్సీ (గతంలో టీఎస్‌పీఎస్సీ) ఏర్పాట్లు చేస్తోంది. జూన్ 9న ఉదయం 10.30 నుంచి ఒంటిగంట వరకూ పరీక్ష నిర్వహిస్తారు. 

ఈ పరీక్షకు భారీగా 4.03 లక్షల మంది దరఖాస్తు చేసుకోవడంతో ఓఎంఆర్ విధానంలోనే పరీక్ష నిర్వహించేందుకు టీజీపీఎస్సీ నిర్ణయించింది. సీబీఆర్‌టీ విధానంలో పలు సెషన్లలో పరీక్షలు నిర్వహించాల్సి వస్తుంది. అందువల్ల ఒక్క రోజులోనే పరీక్ష పూర్తి చేసేందుకు వీలుగా ఓఎంఆర్ పద్ధతిలోనే పరీక్ష నిర్వహించాలని టీజీపీఎస్సీ నిర్ణయించింది. హాల్ టిక్కెట్లు జూన్ 1న అందుబాటులోకి వస్తాయి. ప్రిలిమినరీలో ప్రతిభ చూపిన వారిని జోన్ల వారీగా పోస్టుల సంఖ్యకు అనుగుణంగా 1:50 నిష్ఫత్తిలో తీసుకుంటారు. రిజర్వుడ్ వర్గాల్లో అభ్యర్థుల సంఖ్య తక్కువైతే మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. 

ప్రిలిమ్స్‌కు హాజరయ్యే విద్యార్థులకు టీజీపీఎస్సీ కీలక సూచనలు చేసింది. అభ్యర్థులకు వ్యక్తిగత వివరాలతో కూడిన ఓఎమ్‌ఆర్ పత్రాలు అందజేస్తామని వెల్లడించింది. 

  • అభ్యర్థులకు పరీక్ష రోజు హాల్‌టిక్కెట్ నంబర్, ఫొటో, పేరు, తండ్రి, తల్లి పేర్లు, పుట్టిన తేదీ, పరీక్ష కేంద్రం, జెండర్ వివరాలను ముద్రించిన ఓఎమ్ఆర్ జవాబు పత్రం ఇస్తారు. ఇందులో తప్పులుంటే ఇన్విజిలేటర్ దృష్టికి తీసుకెళ్లి, సాదా ఓఎంఆర్ పత్రాన్ని పొందాలి.
  • పరీక్ష రాసేముందు ప్రశ్నపత్రం నంబర్ ఓఎంఆర్ షీట్ లో నమోదు చేసి, సర్కిళ్లను జాగ్రత్తగా బబుల్ చేయాలి. జవాబు పత్రంలో పేర్కొన్న చోట అభ్యర్థి, ఇన్విజిలేటర్ సంతకం చేయాలి, జవాబులు గుర్తించేందుకు బ్లూ లేదా బ్లాక్ పెన్ను ఉపయోగించాలి. 
  • పరీక్ష పూర్తయిన తరువాత జవాబు పత్రాలను స్కానింగ్ చేసి, అభ్యర్థుల డిజిటల్ కాపీలు వెబ్‌సైట్లో పొందుపరుస్తారు. ప్రశ్నపత్రంలో ఇంగ్లిష్ పదాలు, వాక్యాల అర్థం తెలుగులో సరిగా అనువాదం కాకుంటే ఇంగ్లిష్ వర్షన్ కాపీని పరిగణనలోకి తీసుకుంటారు. 
  • సమాధానాలు గుర్తించేందుకు, పొరపాట్లు జరగకుండా ప్రాక్టీస్ చేసేందుకు నమూనా ఓఎంఆర్ పత్రాన్ని కమిషన్ వెబ్ సైట్లో పొందుపరిచింది. ఓఎంఆర్ లో వివరాలు సరిగా బబుల్ చేయకుంటే ఆ జవాబు పత్రాన్ని తిరస్కరిస్తామని కమిషన్ స్పష్టం చేసింది. 
  • హాల్ టిక్కెట్ తో పాటు అభ్యర్థులు పరీక్ష కేంద్రానికి ప్రభుత్వం జారీ చేసిన ఏదైనా గుర్తింపు కార్డు (పాన్, పాస్ పోర్టు, ఓటర్ కార్డు, ఆధార్ కార్డు, ప్రభుత్వ గుర్తింపు కార్డు, డ్రైవింగ్ లైసెన్స్) ఒరిజినల్స్ తీసుకెళ్లాలి. 
  • అభ్యర్థుల బయోమెట్రిక్ ను ఇన్విజిలేటర్లు పరీక్ష కేంద్రంలో ఉదయం 9.30 నుంచి ప్రారంభిస్తారు. బయోమెట్రిక్ పూర్తయ్యేవరకు అభ్యర్థులెవరూ పరీక్ష కేంద్రం నుంచి బయటకు వెళ్లడానికి వీలు లేదు. 
  • బయోమెట్రిక్ లో ఫింగర్ ప్రింట్ తీసుకునేందుకు వీలుకాకుంటే.. అభ్యర్థి ఫొటోను తీసుకుని ఇంక్ ప్యాడ్ ద్వారా వేలిముద్రను బయోమెట్రిక్ గా తీసుకుంటారు. 
  • అభ్యర్థుల చేతులపై గోరింటాకు, తాత్కాలిక టాటూలు వేసుకోకూడదు.

Related posts

కిన్నెర కళాకారుడు మొగులయ్య ప్లాట్ కాంపౌండ్ వాల్‌ను ధ్వంసం చేసిన దుండగులు

Ram Narayana

వీఆర్ఏలతో చర్చల కోసం కేటీఆర్ నేతృత్వంలో మంత్రివర్గ ఉపసంఘం

Drukpadam

వరుసగా మూడోసారి గవర్నర్ తేనీటి విందుకు కేసీఆర్ దూరం.. కానరాని కాంగ్రెస్, బీజేపీ కీలక నేతలు

Ram Narayana

Leave a Comment