Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

వ్యాక్సిన్ పై ప్రధాని నిర్ణయం చారిత్రాత్మకం …పొంగులేటి సుధాకర్ రెడ్డి

వ్యాక్సిన్ పై ప్రధాని నిర్ణయం చారిత్రాత్మకం…
-రాష్ట్రాలు ఆందోళ పడాల్సిన అవసరం లేదు
– వ్యాక్సిన్ఉచితంగానే రాష్ట్రాలకు అందిస్తారు
-బీజేపీ కోర్ కమిటీ సభ్యుడు మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి

జూన్ 21 నుంచి దేశ ప్రజలందరికీ ఉచితంగా కరోనా వ్యాక్సిన్ ఇవ్వాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీసుకున్న నిర్ణయం అమోఘం, చారిత్రాత్మకని బీజేపీ కోర్ కమిటీ సభ్యులు మాజీ ఎమ్మెల్సీ తమిళనాడు రాష్ట్ర పార్టీ జాతీయ కో కన్వీనర్ పొంగులేటి సుధాకర్ రెడ్డి పేర్కొన్నారు.. ప్రధాని నిర్ణయాన్ని స్వాగతిస్తూ సోమవారం సాయంత్రం ఆయన పత్రికా ప్రకటన విడుదల చేశారు. నరేంద్ర మోడీ దేశ ప్రజల మనసెరిగిన ప్రధాని అని ఆయన కొనియాడారు. కరోనాపై ప్రతిపక్షాలు ఇష్టారాజ్యంగా విమర్శలు చేశారని ఆయన ధ్వజమెత్తారు.కరోన రాజకీయాలు., వ్యాక్సిన్ రాజకీయాలు చేశారని ఆయన మండిపడ్డారు . కరోన పై విషపూరిత, కుట్రపూరిత ప్రచారం చేశారని ఆయన విమర్శించారు.. ప్రధాని మోడీ ప్రతిష్ట ను దెబ్బ తీసేలా ఇష్టం వచ్ఛినట్లు మాట్లాడారని పేర్కొన్నారు. .వ్యాక్సిన్ భారం రాష్ట్రాలపై లేకుండా చేసి ప్రధానమంత్రి తన విశాల హృదయాన్ని చాటుకున్నారని ఆయన కొనియాడారు. కరోనా సంక్షోభంలో సద్విమర్శలు చేయకుండా విపక్షాలు దిగజారుడు రాజకీయాలకు పాల్పడ్డాడని విమర్శించారు ఇప్పటికైనా నరేంద్ర మోడీ పాలనాదక్షతను, పేదప్రజల సంక్షేమం పట్ల అంకిత భావాన్ని గుర్తించాలని హితవు పలికారు.కరోన సంక్షోభాన్ని ఎదుర్కోనేందుకు మోడీ తో కలిసి పని చేసి దేశం పట్ల చిత్తశుద్ధి ని నిరూపించుకోవాలని విపక్షాల కు విజ్ఞప్తి చేసారు. అలాగే ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకాన్ని నవంబర్ వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకోవడం పట్ల ఆయన ముదావహం వ్యక్తంచేశారు.. ఈ నిర్ణయం ద్వారా దేశంలోని 80 కోట్లమంది పేద ప్రజలకు ప్రయోజనం కలుగుతుందని ఆయన పేర్కొన్నారు.

Related posts

నా సభలకు జనం విఫరీతంగా వచ్చారు …ఓట్లప్పుడు వదిలేశారు …పవన్ కళ్యాణ్ ఆవేదన …

Drukpadam

అదే జరిగితే అసదుద్దీన్ ఒవైసీ జంధ్యం ధరిస్తారు: యూపీ మంత్రి భూపేంద్ర సింగ్!

Drukpadam

హుజూరాబాద్ నుంచి ఈట‌ల భార్య పోటీ?.. ఆసక్తిక‌ర వ్యాఖ్య‌లు చేసిన జ‌మున‌!

Drukpadam

Leave a Comment