Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
జాతీయ రాజకీయ వార్తలు

మోడీ అబద్దాలకోరు…తెలంగాణ ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క..

మోడీ పెద్ద అబద్దాల కోరు …ఫ్రస్టేషన్ లో ఉన్నారు …ఈసారి అధికారం దక్కడం అంత తేలిక కాదని తేలిపోయింది …అందువల్లనే ప్రధాని స్థాయిని మరిచి నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని తెలంగాణ ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మోడీ విధానంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు …పంజాబ్ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న భట్టి బీజేపీ విధానాలను తూర్పారబట్టారు …

హిందూ, ముస్లిం పేరిట మత రాజకీయాలు చేయడం తప్ప బిజెపికి మరో ఎజెండా లేదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కమల్లు ఆరోపించారు. శనివారం పంజాబ్ రాష్ట్రంలోని ఫరీద్ కోట్ లోక్ సభ నియోజకవర్గం పరిధిలోని మొగ, ధరంకోట్ అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పలు సమావేశాల్లో పాల్గొని ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ప్రజాస్వామ్యాన్ని, దేశ రాజ్యాంగాన్ని కాపాడేందుకే ఇండియా కూటమి ఏర్పడింది దానికి అనుగుణంగానే పోరాడుతుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు వివరించారు. దేశంలో కొద్దిమంది తన మిత్రులు మాత్రమే ధనికులుగా మిగిలిన వాళ్లంతా పేదవారిగా మిగిలిపోవాలని ప్రధాని మోడీ కోరుకుంటున్నారని డిప్యూటీ సీఎం ఆరోపించారు. బిజెపి మరోసారి గెలిస్తే రాజ్యాంగం అంతమవుతుంది, అప్పుడు దేశంలో ప్రభుత్వ రంగ సంస్థలు ఉండవు, ద్రవ్యోల్బణం, ధరలు పెరుగుతాయి రిజర్వేషన్లు రద్దు చేస్తారని తెలిపారు. ఈసారి లోక్ సభ ఎన్నికల్లో ఇండియా కూటమి ముందంజలో ఉందని అన్నారు. గత పది ఏళ్లలో మోడీ ఎన్నో హామీలు ఇచ్చారు కానీ వాటిని నెరవేర్చలేదు అందుకే ఈసారి ప్రజలు ఇండియా కూటమికి మద్దతుగా నిలిచారని తెలిపారు. మోడీ పెద్ద అబద్దాలకోరు. ప్రతి సంవత్సరం రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని, ప్రతి ఒక్కరి అకౌంట్లోరూ. 15 లక్షలు జమ చేస్తానని, రైతుల ఆదాయం రెట్టింపు చేస్తానని అబద్ధాలు చెప్పారని దుయ్యబట్టారు.

Related posts

రాహుల్ గాంధీపై పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థిపై 242 క్రిమినల్ కేసులు!

Ram Narayana

రాముడిని తలుచుకుంటూ ప్రాణాలు విడిచిన గాంధీ అనుచరులం: ప్రియాంక గాంధీ

Ram Narayana

నితీశ్ కుమార్‌కు ఇండియా కూటమి ప్రధాని పదవిని ఆఫర్ చేసింది, కానీ…: జేడీయూ

Ram Narayana

Leave a Comment