Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ప్రపంచ ప్రజాస్వామ్యానికి చీకటి – అమెరికా రాజధాని భవనం ధ్వంసం

  • ప్రపంచ ప్రజాస్వామ్యానికి చీకటి
  • అమెరికా రాజధాని భవనం ధ్వంసం
  • ట్రంప్ మద్దతు దారుల అరాచకాలు
  • మనం మన చట్టాలను -న్యాయాన్ని గౌరవించాలి , ప్రజా స్వామ్యాన్ని కాపాడాలి – ప్రసిడెంట్ ఎలెక్ట్ – జోబిడెన్
  • గో హోమ్ ,గో హోమ్ విత్ పీస్ – ప్రెసిడెంట్ ట్రంప్

అమెరికాలో ప్రజాస్వామ్యానికి దుర్దినంగా , చీకటి రోజుగా బుధవారం మిగిలింది . నవంబర్లో జరిగిన ఎన్నికల్లో ఓడిన ట్రంప్ దాన్ని అంగీకరించటం లేదు సరికదా, అధ్యక్ష భవనాన్ని వదల బోనని పలుమార్లు చెబుతున్నట్లు వార్తలు వచ్చాయి . అందుకు తగ్గట్లుగానే జార్జియా రాష్ట్రంలో సెనేట్ ఎన్నికల ప్రచారంలో సైతం రెచ్చగొట్టే ప్రసంగం చేశారు . సెనేటర్లను గుర్తించి , ధృవీకరించే కాంగ్రెస్ సమావేశం సందర్భంగా రాజధాని ముట్టడికి పిలుపు ఇచ్చారు . దీంతో ట్రంప్ మద్దతురాలు వందలాది మంది మూకుమ్మడిగా వచ్చి ఒక్క సరిగా సమావేశం జరుగుతున్న భవనాన్ని చుట్టు మట్టటంతో అమెరికా పోలీసులు కంగు తీన్నారు . ఆందోళన కారులు పార్లమెంట్ భవనాన్ని చుట్టూ ముట్టటంతో ఆగకుండా ,ఆఫీసులోకి చొరబడి అద్దాలను పగలగొట్టారు, కిటికీలను ద్వాంసం చేశారు . స్పీకర్ ఆఫీసులోకి చొరబడి ఆయన సీట్లోనే కూర్చొని అరాచకాలు సృష్టించారు . రాజధాని భవనం పైకి ఎక్కేందుకు ఆదోళన కారులు తమ వెంట తాళ్లను కూడా తెచుకున్నారంటే వారు మందస్తు ఫక్క ప్రణాళికతోనే వచ్చారని అర్థం అవుతుందని పలువురు పేర్కొంటున్నారు . ఒక సందర్భంలో ఎక్కడ ఏమి జరుగుతుందో తెలుసుకొనే లోపలే ఆందోళనకారులు ధ్వంస రచన చేశారు. అతి పెద్ద ఆదర్శ ప్రజాస్వామ్యంగా చెప్పుకుంటున్న అమెరికా జరుగుతున్న పరిణామాలను ప్రపంచం మొత్తం ఆశక్తిగా తిలకించింది . అనేక మంది దేశాధినేతలు ఈ చర్యలు చూసి ముక్కున వేలేసుకున్నారు . ట్రంప్ ప్రపంచానికి ఏమి సందేశం ఇవ్వాలని అనుకున్నాడని అనేక మంది ప్రశ్నిస్తున్నారు . అమెరికా పౌరులు ట్రంప్ మద్దుతు దార్ల చర్యలకు దిగ్బ్రాంతికి గురైయ్యారు . ఆందోళనకారులను చెదర గొట్టేందుకు జరిపిన కాల్పులలో ఒక మహిళకు గాయాలైయ్యాయి . ఆమెకు సీరియస్ గా ఉండటంతో హాస్పిటల్ కు తరలించారు .

నవంబర్ 3 న హోరాహోరీగా జరిగిన అధ్యక్ష ఎన్నికలలో ప్రస్తుత అధ్యక్షడు రిపబ్లిక్ పార్టీకి చెందినట్రంప్ పై డెమొక్రాటిక్ పార్టీకి చెందిన జోబిడెన్ గెలుపొందారు . దీనిని జీర్ణించుకోలేని ట్రంప్ బుధవారం సెనేట్ లో లెక్కింపు , ధ్రువీకరణ విధానం జరుగుతుండగా దాన్ని అడ్డు కోవాలని పిలుపు ఇవ్వడంతో ఆయన మద్దతు దార్లు వాషింగ్టన్ డి సి లోని రాజధాని భవనం ముట్టడించారు ఆగమాగం చేశారు . చివరకు సొంత పార్టీ సెనెటర్లే ఆదోళనకారులును కట్టడి చేయాలనీ ట్రంప్ కు చెప్పటం తో చాలాసేపు శాంతియుతంగా ఆదోళన చేయమని చెప్పిన ట్రంప్ ఆందరూ శాంతియుతంగా ఇళ్లకు వెళ్లిపోవాలని పిలుపునిచ్చారు .


ప్రెసిడెంట్ ఎలెక్ట్ జోబిడెన్ ఈ సందర్బంగా మాట్లాడుతూ రాజధాని ముట్టడి కార్యక్రమం రాజ్యాంగ విరుద్ధమైంది . చట్టాలను గౌరవించాలి , మనం భవిషత్ తరాలకి ఏమీ సందేశం ఇస్తున్నామో తెలుసుకోవాలి . మన ప్రజాస్వామ్య విలువలను గౌరవించుకోవాలి . రాజధానిలో జరుగుతున్న ధ్వంసం గురించి మనపిల్ల గమనిస్తున్నారు వారికీ ఏమి సందేశం ఇస్తున్నాం . ఇప్పటకైనా ట్రంప్ టెలివిజన్ ముందుకు వచ్చి ఆదోళనకారులు శాంతంగా ఉండమని చెప్పాలని అన్నారు . ఆయన అన్న కొద్దీ చేపటికే ట్రంప్ టీవి లకు గో హోమ్ గో హోమ్ శాంతంగా ఉండాలని ఒక వీడియో సందేశం పంపించారు . అమెరికాలో జరిగిన బుధవారం సంఘటనలు ప్రపంచాన్ని నివ్వెరపోయేలా చేశాయి .

Related posts

దళిత సీఎంకు కాంగ్రెస్ అడ్డుపడిందా? తామే చేయనివ్వలేదని షబ్బీర్ అలీ చెప్పారా ??

Drukpadam

అన్న వద్దన్నారు…అమ్మ ఒకే చెప్పింది-పార్టీ ఏర్పాటుపై షర్మిల

Drukpadam

ఔరంగాబాద్‌ పేరు మార్పు …ఇక నుంచి శంభాజీ నగర్ రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయం!

Drukpadam

Leave a Comment