Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రైమ్ వార్తలుతెలంగాణ వార్తలు

డిప్యూటీ సీఎం భట్టి నివసిస్తున్న ప్రజా భవన్ కు బాంబు బెదిరింపు …

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు కుటుంబం నివాసం ఉంటున్న ప్రజా భవన్ లో బాంబు ఉన్నట్లు అజ్ఞాత వ్యక్తి 100కు డయల్ చేసి చెప్పడంతో రాష్ట్ర పోలీస్ శాఖ వెంటనే అప్రమత్తమయింది. ఇంటలిజెన్స్ సెక్యూరిటీ వింగ్, హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ వింగ్ పోలీస్ అధికారులను రంగంలోకి దింపింది. హుటాహుటిన బాంబ్, డాగ్ స్క్వాడ్ బృందాలు ప్రజాభవన్ కు చేరుకొని అడుగడుగున తనిఖీలు చేపట్టారు. విషయం తెలుసుకున్న పంజాగుట్ట ఏసిపి మనోహర్ కుమార్ హుటాహుటిన సంఘటన స్థలానికి తన సిబ్బందితో చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. ప్రజాభవన్ ఎంట్రన్స్ నుంచి నివాసం లోపల ఉన్న అన్ని గదులను, బెడ్రూమ్స్, కిచెన్, డైనింగ్ హాల్, విజిటర్ హాల్స్, ఉప ముఖ్యమంత్రి ఛాంబర్, జిమ్, గార్డెన్, పరిసర ప్రాంతాలను అణువణువునా డాగ్ స్క్వాడ్ బృందం పోలీసులు తనిఖీలు చేశారు. అదేవిధంగా భట్టి విక్రమార్క కాన్వాయ్, కుటుంబ సభ్యులు వాడుతున్న వాహనాలను పోలీసులు క్షున్నంగా పరిశీలించారు. ఆ తర్వాత ప్రజాభవన్ లో ఉన్న అమ్మవారి ఆలయం లో తనిఖీలు చేశారు. ప్రజాభవన్ పరిసర ప్రాంతాల్లో తనిఖీలు కొనసాగుతున్నాయి.

ప్రజాభవన్లో బాంబు ఉన్నట్లు ఫోన్ చేసిన వ్యక్తి కోసం పోలీసులు అన్వేషణ మొదలుపెట్టారు. సెల్ఫోన్ సిగ్నలింగ్ ఆధారంగా కనిపెట్టే పనిలో పోలీసులు రంగంలోకి దిగినట్టు తెలుస్తున్నది. ఫోన్ చేసిన వ్యక్తి ఆకతాయి లేక కావాలని ఉద్దేశపూర్వకంగానే ఫోన్ చేశాడా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ప్రజాభవన్ లో బాంబు ఉందని ఫోన్ రావడంతో పోలీసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఈ విషయం ప్రచారం మాధ్యమాలు రావడంతో రాష్ట్రవ్యాప్తంగా ఒక్కసారిగా కలకలం రేగింది…

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క’ఏఐసీసీ ఆదేశాల మేరకు గత వారం రోజులుగా పంజాబ్ ఎన్నికల ప్రచారంలో ఉండగా ,ఆయన సతీమణి నందిని బయటకు వెళ్లారు …ఇద్దరు కుమారులు ఇంట్లోనే ఉన్నారు … విషయం తెలిసిన వెంటనే భట్టి కుమారులతో మాట్లాడి దైర్యం చెప్పారు …పోలీసులు హుటాహుటిన రంగంలోకి దిగి అణువణువు గాలించారు … ఫోన్ చేసిన ఆగంతకుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు …ఇది ఆకతాయిలు చేసిందా లేక ఏదైనా కుట్ర దాగిఉంది అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ..

గతంలో ప్రగతి భవనంగా పిలవబడే ప్రస్తుత ప్రజాభవన్ లో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క నివాసం ఉంటున్నారు …ఆప్రాంగణంలోనే రాష్ట్ర మంత్రి సీతక్క కూడా నివాసం ఉంటున్నారు …భట్టి నివాసం ఉంటున్న దానిలోనే సీఎం గా కేసీఆర్ నివాసం ఉన్నారు ..

Related posts

గ్రూప్ వన్ పరీక్షలు ముందుకు వెళ్ళేవి కావు …ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అనుమానం …

Ram Narayana

బడ్జెట్ తయారీ పారదర్శకంగా ఉండాలి …సీఎం రేవంత్ రెడ్డి

Ram Narayana

వింత మొగుడు కొత్త కాపురం … శారీరక సంబంధం వద్దని భర్త హితబోధ!

Drukpadam

Leave a Comment