Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఖమ్మం వార్తలు

చేతి గుర్తా …? కారు గుర్తా …? ఓటర్లు దేవుళ్ళు ఎవరిని కరుణించారు ..

ఎన్నికలు పూర్తీ అయ్యాయి… జూన్ 4 జరిగే కౌంటింగ్ కు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తుంది…కౌంటింగ్ సెంటర్లకు చేసిన ఈవీఎంలకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు చేశారు ..మూడంచెల పోలీస్ భద్రతను ఏర్పాటు చేశారు ..

చేతి గుర్తా …? కారు గుర్తా …? ఓటర్లు దేవుళ్ళు ఎవరిని కరుణించారు అనేదానిపై చెరోపచర్చలు …తమకే అనుకూలంగా ఉందని కాంగ్రెస్ నేతలు గెలుపు ధీమాతో ఉండగా ..తమకే అనుకూలంగా ఉందని బీఆర్ యస్ నేతలు అంటున్నారు …బీజేపీ అభ్యర్థికి గౌరవప్రదమైన ఓట్లు లభిస్తాయా లేదా అనేది ఆసక్తిగా మారింది ..పోలింగ్ కు కౌంటింగ్ కు 20 రోజులకు పైగా సమయం ఉండటంతో జూన్ 4 తేదీన జరిగే కౌంటింగ్ కోసం ఎదురు చూస్తున్నారు …ఈలోగా పట్టభద్రుల ఉప ఎన్నిక రావడంతో నేతలంతా ఉరుకులు ,పరుగులు పెట్టారు …మొత్తం మీద ఒక పక్క అధిక ఎండలు , మరో పక్క రాజకీయ వేడితో నేతలంతా ఉక్కిరి బిక్కిరి అయ్యారు …

పోలింగ్ సరళిపై వివిధ రాజకీయ పార్టీలు , అభ్యర్థులు , మంత్రులు , విశ్లేషకులు ,రాజకీయ పండితులు అరా తీస్తున్నారు … లెక్కలు వేసుకుంటున్నారు …గ్రామాల వారీగా వివరాలు సేకరిస్తున్నారు … ఏ ఏ నియోజకవర్గాల్లో మండలాల్లో ఎవరికి అనుకూలంగా ఓట్లు పాలైయ్యాయి …తటస్థ ఓటర్లు ఎటు మొగ్గు చూపారు … కులాలవారీగా ఎవరికీ అనుకూలంగా ఓటు చేశారు …మొత్తం మీద చేతి గుర్తా …కారు కు జై కొట్టారా ..? ఓటర్లు దేవుళ్ళు ఎవరిని కరుణించారు అనే చర్చ జరుగుతుంది …పందెం రాయిళ్ళు కాస్కో అంటూ బెట్టింగులు పెడుతున్నారు … రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ పార్టీ పై ప్రజల్లో వ్యతిరేక ప్రభావం ఈ ఎన్నికల్లో ఎంతవరకు చూపింది …బీఆర్ యస్ అభ్యర్థికి సామాజికవర్గం కలిసి వస్తుందా …? బీజేపీ అభ్యర్థికి మోడీ షరిస్మా, అయోధ్యలో రామమందిర నిర్మాణం ఓట్లు రాల్చుతుందా …? అనే చర్చలు జరుగుతున్నాయి….అధికార పార్టీకి జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉండటంతోపాటు , సిపిఐ , సిపిఎం , సిపిఐ (ఎం.ఎల్ మాస్ లైన్ ) పార్టీలు టీడీపీ లోని ఒక వర్గం మద్దతు అదనపు అవకాశం … బీఆర్ యస్ అభ్యర్థికి సైతం టీడీపీలోని ఒక వర్గం మద్దతు ఇవ్వగా కమ్మసామాజిక వర్గం ఓట్ల పై నమ్మకం పెట్టుకున్నారు … అయితే ఓటర్లు ఈసారి సైలెంట్ గా ఓటు వేశారు …ఖమ్మం ,కొత్తగూడెం లాంటి అర్బన్ నియోజకవర్గాల్లో ఓటింగ్ శాతం బాగా తగ్గింది …రూరల్ ప్రాంతాల్లో ఓటర్లు తమకు నచ్చిన పార్టీకి ఓటు వేసేందుకు ఉచ్చుకత చూపారు …మొత్తానికి జూన్ 4 రానున్న ఫలితం కోసం అభ్యర్థులతోపాటు ఓటర్లు ఎదురు చూస్తున్నారు …

Related posts

సత్తుపల్లిలో సండ్రకు ప్రజల బ్రహ్మరథం …రోజురోజుకు పెరుగుతున్న మద్దతు…

Ram Narayana

భరతమాత ముద్దుబిడ్డ ,మార్క్సిస్ట్ మేధావి సీతారాం ఏచూరి ! ఎస్ వీరయ్య

Ram Narayana

ఆరు గ్యారంటీల అమలు ప్రతిష్టాత్మకం …అందుకే ప్రజాపాలన కార్యక్రమం :మంత్రులు కోమటిరెడ్డి , తుమ్మల , పొంగులేటి …

Ram Narayana

Leave a Comment