Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఖమ్మం వార్తలు

శీనన్న ఎన్నికలప్పుడే వచ్చే టైపు కాదు…మంత్రి పొంగులేటి

శీనన్న ఎన్నికలప్పుడే వచ్చే టైపు కాదు…!

  • పాలేరు నా సొంతిల్లు…. చక్కబెట్టుకునే బాధ్యత నాది
  • మూడేళ్లలోపే అర్హులైన ప్రతీ ఒక్కరికీ ఇందిరమ్మ ఇళ్లు
  • ఏడాదిలోపు రోడ్లు, డ్రైనేజీలు పూర్తిచేయిస్తా
  • తాగునీరు, సాగునీరుకి ఇబ్బందులు రానివ్వను
  • తిరుమలాయపాలెం మండల పర్యటనలో మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి

తానేంటో నిరూపించుకునేందుకు మంత్రి పొంగులేటి ప్రయత్నాలు ప్రారంభించారు …ఎన్నికలు జరిగి కొద్దినెలలే అయినప్పటికీ మంత్రి గెలిచిన జాడ లేకుండా పోయారని చుట్టపు చూపుగా వస్తున్నారని, వచ్చిన ప్రజలను కావడంలేదని జరుగుతున్నా ప్రచారాన్ని తిప్పికొట్టే చర్యలకు శ్రీకారం చుట్టారు …పొంగులేటి రాజకీయాల్లో అడుగుపెట్టింది మొదలు గత పది సంవత్సరాలుగా ప్రజల్లో ఉన్నారు …పదవి ఉన్న లేకపోయినా ప్రజల మనిషిగా ముద్రపడ్డారు …తన కంటూ ప్రజల్లో ఒక క్రేజీ ఏర్పాటు చేసుకున్న పొంగులేటి నియోజకవర్గంలో జరుగుతున్న ప్రచారాన్ని తిప్పికొట్టేలా అడుగులు వేస్తున్నారు … ప్రతి వూరు ప్రతి తండా చుట్టేస్తున్నారు …వారి సమస్యలు తెలుసుకుంటున్నారు నేనున్నానని భరోసా ఇస్తున్నారు ..

శుక్రవారం తిరుమలాయపాలెం మండల పర్యటన సందర్భంగా ఆయన మాట్లాడుతూ ….ఎన్నికలప్పుడు మాత్రమే ఓట్లకోసం వచ్చే టైపు మీ శీనన్న కాదు… ఇప్పుడు ఎన్నికలు లేవు… ఓట్లు అడగాల్సిన అవసరం లేదు. మీ ఆశీస్సులు… దీవెనలతో ఇక్కడి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిని అయిన నేను మీ సమస్యలెంటో నేరుగా తెలుసుకుని వాటిని పరిష్కారించేందుకు వచ్చాను. మీరు నాకిప్పుడు ప్రతి వినతిని పరిశీలించి.. వాటిన్నింటిని వీలైనంత త్వరగా పరిష్కారింపజేసేందుకు కృషిచేస్తానని తెలంగాణ రెవెన్యూ, గృహనిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి పేర్కొన్నారు. తిరుమలాయపాలెం మండలంలోని కొక్కిరేణి, ఎర్రగడ్డ, గోపాలపురం, తిమ్మక్కపేట, తాళ్లచెర్వు, బీరోలు, ఏలువారి గూడెం, బంధంపల్లి, బచ్చోడుతండా, సోలిపురం, రాజారాం, పైనంపల్లి, జూపెడ, కాకరవాయి, సుద్దవాగుతండా, ముజాహిద్ పురం, ఏనుకుంట తండా, మంగళిబండతండా, రఘునాథపాలెం తదితర గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో ప్రజల నుంచి ఇళ్లు, రేషన్ కార్డు, పెన్షన్లు, రోడ్లు, కరెంటు, డ్రైనేజీలు తదితర సమస్యల పై ఇచ్చిన వినతులను స్వీకరించారు. అనంతరం స్థానిక ప్రజలను ఉద్దేశించి మంత్రి పొంగులేటి మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటాల్లోనే… పాలేరు నా సొంతిల్లు… చక్కబెట్టుకునే బాధ్యత నాదే…. మీ ఇంటి పెద్దకొడుకుగా నన్ను భావించి… అత్యధిక మెజారిటీతో నన్ను అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపించి మంత్రిగా నాకు అవకాశం కలిగేలా సహకరించిన మీ రుణం తప్పకుండా తీర్చుకుంటా… రాష్ట్ర వ్యాప్తంగా ఐదేళ్లలో ప్రతీ నియోజకవర్గంలో అర్హులైన ప్రతీ ఒక్కరికీ ఇందిరమ్మ ఇల్లు దక్కేలా చూస్తామని సీఎం హామీ ఇచ్చారు. ఆ ఇంటి మంత్రిని నేనే కాబట్టి పాలేరు నియోజకవర్గంలోని అర్హులైన ప్రతీ ఒక్కరికీ మూడేళ్లలోపే ఇల్లు దక్కేలా చూస్తానని మీకు హామీ ఇస్తున్నా..! అదేవిధంగా ఏడాదిలోపే నియోజకవర్గ వ్యాప్తంగా రోడ్లు, డ్రైనేజీలు పూర్తిచేయిస్తా… తాగునీరు, సాగునీరుకి ఇబ్బందులు రాకుండా చూసుకుంటాను. విద్యా, వైద్యం, ఆరోగ్యం ఇలా ఏ రకమైన సమస్య వచ్చినా తీర్చే బాధ్యత నాదంటూ తన ప్రసంగాన్ని ముగించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

కొత్తగూడెంలో వనమా గెలుపు కోసం ఎంపీ వద్దిరాజు బుల్లెట్ పై హల్చల్

Ram Narayana

కేంద్ర పథకాలను పకడ్బందీగా అమలు చేయాలి….. ఖమ్మం ఎంపీ రఘురాం రెడ్డి

Ram Narayana

ఖమ్మంలో బీజేపీ దూకుడు …

Ram Narayana

Leave a Comment