జాతీయ రాజకీయ వార్తలు

యూపీలో 11 నుంచి కాంగ్రెస్ ధన్యవాద్ యాత్ర…

  • యూపీలో బీజేపీకి మించి సీట్లు గెలుచుకున్న ఇండియా కూటమి
  • తమను ఆదరించిన ప్రజలకు ధన్యవాదాలు చెప్పాలని కాంగ్రెస్ నిర్ణయం
  • మొత్తం 403 నియోజకవర్గాల్లోనూ యాత్ర

లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లో అనూహ్యంగా పుంజుకున్న కాంగ్రెస్ పార్టీ.. తమను అక్కున చేర్చుకున్న యూపీ ప్రజలకు ధన్యవాదాలు తెలిపేందుకు యాత్ర చేపట్టాలని నిర్ణయించింది. ఈ నెల 11 నుంచి 15 వరకు రాష్ట్రంలోని 403 నియోజకవర్గాల్లో ‘ధన్యవాద్ యాత్ర’ చేపట్టాలని నిర్ణయించింది. సీనియర్ నేతలు, కార్యకర్తలు ఈ యాత్రలో పాల్గొంటారని సమాచారం. 

ఈ యాత్ర సందర్భంగా వివిధ సామాజిక వర్గాలకు చెందిన ప్రజలకు రాజ్యాంగ పుస్తకాన్ని బహూకరించి గౌరవిస్తారు. ఉత్తరప్రదేశ్‌లోని 80 లోక్‌సభ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 8 గెలుచుకోగా, మిత్రపక్ష సమాజ్‌వాదీ పార్టీ 37 స్థానాల్లో జయకేతనం ఎగురవేసింది.

Related posts

నన్ను తిట్టినా భరిస్తాను… కానీ…!: ప్రధాని మోదీ!

Ram Narayana

సీఎం పదవికి అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా చేయరు: ఆప్ ప్రకటన

Ram Narayana

కేరళ ప్రభుత్వం అసాధారణ చర్య.. రాష్ట్రపతిపై సుప్రీంకోర్టులో దావా

Ram Narayana