Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ వార్తలు

టీయూడబ్ల్యూజే (ఐజేయూ ) మూడవ మహాసభలకు సిద్దమవుతున్న ఖమ్మం…

నిత్యం జర్నలిస్టుల సమస్యల పరిస్కారం కోసం పోరాడుతూ ఉద్యమమే ఊపిరిగా సమస్యల పరిస్కారమే ఎంజెండాగా పనిచేస్తున్న టీయూడబ్ల్యూజే (ఐజేయూ ) మూడవ రాష్ట్ర మహాసభలు ఈనెల 19 ,20 తేదీల్లో ఖమ్మంలో జరగనున్నాయి …అందుకోసం ఖమ్మం జిల్లా కమిటీ విస్త్రత ఏర్పాట్లు చేస్తుంది …కె .అమర్ నాథ్ ప్రాంగణం (ఉష కన్వెన్షన్ హాల్) లో జరిగే ఈసభలకు రాష్ట్రంలోని 33 జిల్లాల నుంచి ప్రతినిధులు హాజరు కానున్నారు ..ఇందుకు ఖమ్మం పట్టణంలో ఆకర్షణీయంగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తున్నారు … ..

ఈసభలకు రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క , వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు , సమాచార ప్రసారాల శాఖామంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్, ఐజేయూ అధ్యక్షులు కె .శ్రీనివాస్ రెడ్డి , మాజీ చైర్మన్ ,ఐజేయూ మాజీ అధ్యక్షులు దేవులపల్లి అమర్, ఐజేయూ సెక్రటరీ జనరల్ బల్విందర్ జమ్మూ , మాజీ ఐజేయూ అధ్యక్షులు ఎస్ ఎన్ సిన్హా ,నరేందర్ రెడ్డి ,సోమసుందర్ ,ఎం ఏ మజీద్ ఆలపాటి సురేష్ , కె .సత్యనారాయణ, రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు నగునూరి శేఖర్ ,కె .విరహత్ అలీ వివిధ రాష్ట్రాల ప్రతినిధులు హాజరు కానున్నారు .. జిల్లాకు చెందిన రాజ్యసభ సభ్యులు రేణుకాచౌదరి , వద్దిరాజు రవిచంద్ర , బండి పార్ధసారథి రెడ్డి , ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి, ఎమ్మెల్సీ తాతా మధు విశిష్ట అతిధులుగా హాజరవుతారు ..

సభలకు వచ్చే వారికోసం నగరంలోని  వివిధ హోటల్స్ లో 120 కు  పైగా రూమ్స్ బుక్ చేయడం జరిగింది ...అనేక సభలకు సమావేశాలకు ఆతిధ్యం ఇచ్చిన ఖమ్మం నగరం జర్నలిస్టుల సభలకు ఆతిధ్యం ఇచ్చేందుకు సిద్ధమైంది ...ఉమ్మడి  రాష్ట్రంలో రెండు సార్లు  జర్నలిస్టుల రాష్ట్ర సభలు జరిపిన ఖమ్మం జిల్లా యూనిట్ ఈసారి అంతకు మించి  ఏర్పాట్లు చేయాలనే లక్ష్యంతో పనిచేస్తుంది  ...ఖమ్మం జిల్లా టీయూడబ్ల్యూజే   ప్రముఖ పిల్లల డాక్టర్ కూరపాటి  ప్రదీప్ అధ్యక్షులుగా ,ప్రధాన కార్యదర్శిగా జిల్లా అధ్యక్షులు వనం వెంకటేశ్వర్లు , కోశాధికారిగా ఏనుగు వెంకటేశ్వరరావుల ఆధ్వరంలో  ఆహ్వానంసంఘం ఏర్పడి  పనిచేస్తుంది ... 

ఈనెల 19 న సభలు ప్రారంభం కానుండగా రెవిన్యూ , గృహనిర్మాణ , రాష్ట్ర సమాచార శాఖామంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సభలను ప్రారంభిస్తారు …రాష్ట్ర వ్యవసాయశాఖమంత్రి తుమ్మల నాగేశ్వరరావు ముఖ్యఅతిధిగా పాల్గొంటారు …మీడియా అకాడమీ చైర్మన్ కె .శ్రీనివాస్ రెడ్డి , ఐజేయూ సెక్రెటరీ జనరల్ బల్విందర్ జమ్మూ , ఐజేయూ మాజీ అధ్యక్షులు దేవులపల్లి అమర్ , ఎస్ ఎన్ సిన్హా లు పాల్గొంటారు ..సాయంత్రం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నివేదిక ఉంటుంది ..అనంతరం ప్రధాన కార్యదర్శి ప్రవేశ పెట్టిన నివేదికపై చర్చలు జరుగుతాయి .. మీడియా కమిషన్ ఏర్పాటు , ఉద్యోగ భద్రతా , జర్నలిస్టులపై దాడులు , ఇళ్లస్థలాలు , అక్రిడేషన్ కార్డులు , హెల్త్ కార్డులు , సంక్షమేపథకం అమలు, రైల్వే పాస్ లు తదితర అంశాలపై తీర్మానాలు ఉంటాయి… వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రతినిధులు సందేశాలు ఇస్తారు ..వివిధ జిల్లాల నుంచి వచ్చిన ప్రతినిధులు సెక్రటరీ రిపోర్టుపై మాట్లాడతారు …
ప్రతినిధుల సందేహాలకు సమాధానాలు ఉంటాయి.. సాయంత్రం ముగింపు సభలో రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ముఖ్య అతిధిగా పాల్గొని ప్రసంగిస్తారు ..

Related posts

ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై కొత్త నేర చట్టాల ప్రకారం కేసు…

Ram Narayana

కాంగ్రెస్‌తో చర్చలు చివరి దశకు? రెండు రోజుల్లో ఢిల్లీకి షర్మిల!

Drukpadam

ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడు ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు పై అరెస్టు వారెంట్…

Ram Narayana

Leave a Comment