Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఖమ్మం వార్తలు

బడులు తెరిచినరోజునే పిల్లలకు పుస్తకాలూ ,దుస్తులు పంపిణి చేసిన డిప్యూటీ సీఎం భట్టి ,మంత్రి తుమ్మల …

బడులు తెరిచినరోజునే పిల్లలకు పుస్తకాలూ ,దుస్తులు పంపిణి చేసిన డిప్యూటీ సీఎం భట్టి ,మంత్రి తుమ్మల …
ఇందిరమ్మ రాజ్యంలో విద్యకు అత్యంత ప్రాధాన్యత
పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన
అందుకు ఎంత డబ్బుయైన ఖర్చు చేస్తాం …

తెలంగాణ రాష్ట్ర చరిత్ర లో మొట్ట మొదటి సారిగా ప్రభుత్వ పాఠశాలలు ప్రారంభమైన మొదటి రోజే పిల్లలకు దుస్తులు, పుస్తకాలు పంపిణీ చేసిన చరిత్ర ప్రజా ప్రభుత్వానికి దక్కుతుందని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, ఆర్థిక, ఇంధన శాఖల మంత్రి భట్టి విక్రమార్క మల్లు అన్నారు. బుధవారం ఎన్. ఎస్. కెనాల్ కాలని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పాఠశాల పునఃప్రారంభ మహోత్సవంలో రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తో కలిసి ఉపముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉపముఖ్యమంత్రి మాట్లాడుతూ, ఇందిరమ్మ రాజ్యంలో ఏర్పడిన ప్రజా ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు నిర్మాణం కోసం విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నదన్నారు. విద్యాభివృద్ధికి బడ్జెట్లో ఎన్ని నిధులైన కేటాయిస్తామని ఆయన తెలిపారు. నేటి బాలలే రేపటి పౌరులని, బాలల బంగారు భవిష్యత్తు పై రాష్ట్ర భవిష్యత్తు ఉంటుందని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలు అంటే నిర్లక్ష్యధోరణి ఉండేదని, ఆ ధోరణి నుండి ఇష్టమని భావన ప్రజల్లో కలిగే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రతి విద్యార్థికి కావాల్సిన తరగతి గది, త్రాగునీరు, టాయిలెట్ రన్నింగ్ వాటర్ తో సదుపాయాల కల్పన చేస్తున్నట్లు తెలిపారు. పాఠ్యపుస్తకాలు, నోట్ పుస్తకాలు, యూనిఫామ్ సరైన సమయంలో అందిస్తే, మంచి ఫలితం ఉంటుందని, పాఠశాల తెరిచిన రోజునే అందేలా కార్యాచరణ చేశామన్నారు. ఇంగ్లీష్ మీడియంను బాగా ప్రోత్సహించాలని రాష్ట్ర ప్రభుత్వం పట్టుదలతో ఉన్నట్లు తెలిపారు. విద్యా వ్యాప్తి లో భాగంగా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ ప్రభుత్వంలో పాఠశాలలపై ప్రజలకు నమ్మకాన్ని కలిగిస్తామన్నారు. ఆనాటి యూపీఏ చైర్ పర్సన్ సోనియాగాంధీ, ఆనాటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఆధ్వర్యంలో తీసుకువచ్చిన విద్యాహక్కు చట్టాన్ని తెలంగాణ రాష్ట్రంలో సంపూర్ణంగా అమలు చేయాలని ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తున్నట్లు ఆయన అన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న టీచర్లు సాంకేతికతను అందిపుచ్చుకోవడానికి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలన్నారు.

 కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్యం పై ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు. విద్యపై ఎంత ఖర్చైన ప్రభుత్వం వెనకాడదని, అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మౌళిక సదుపాయాలు కల్పన చేస్తుందని అన్నారు. 2 వేల కోట్ల నిధులతో మిగిలిన సగం పాఠశాలలకు వసతుల కల్పన చేసి, కార్పోరేట్ పాఠశాల లకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు తీర్చిదిద్దుతామని అన్నారు. పేద పిల్లలే అగ్రస్థానంలో వుండేలా, విద్యాశాఖ కు సంబంధించి, ఎక్కడా లోటు లేకుండా చేస్తామన్నారు. మెగా డిఎస్సి ద్వారా సుమారు 10 వేల పోస్టుల భర్తీచేయనున్నట్లు ఆయన తెలిపారు. ప్రభుత్వ ఆలోచన విధానాలకు అనుగుణంగా అధికారులు విధుల నిర్వర్తించాలని అన్నారు. అనేక కష్టాలున్న ప్రభుత్వ పాఠశాలలు, వైద్యశాల ల్లో ఆధునిక విద్య, ఆధునిక వైద్యం అందేట్లు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి అన్నారు.

 కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ మాట్లాడుతూ, పాఠశాలలు పునఃప్రారంభం నాడే పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్ అందించడం చాలా హర్షించదగ్గ పరిణామమని అన్నారు. విద్యార్థుల యూనిఫామ్ మహిళా స్వయం సహాయక సంఘాల మహిళలచే తయారుచేయించామన్నారు. కటింగ్, కాజా, బటన్ మిషన్ల పట్ల మహిళలకు ప్రత్యేక శిక్షణ ఇప్పించినట్లు ఆయన తెలిపారు. యూనిఫామ్ మంచి నాణ్యత తో ఉన్నట్లు ఆయన అన్నారు. ప్రతి ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియంలో బోధన చేపట్టినట్లు ఆయన తెలిపారు.
 ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమలరాజ్, నగర మేయర్ పునుకొల్లు నీరజ, ఖమ్మం నగరపాలక సంస్థ కమీషనర్ ఆదర్శ్ సురభి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి. సత్యప్రసాద్, డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహారా, జిల్లా విద్యాధికారి సోమశేఖరశర్మ, కార్పొరేటర్ కమర్తపు మురళి, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఖమ్మం జిల్లా కేంద్రసహకార బ్యాంకులో వర్గపోరు …రెండుగా చీలిన అధికార పార్టీ డైరక్టర్లు

Ram Narayana

ఆధునిక ఖమ్మం రూపశిల్పిగా ,ఖమ్మం ప్రజానీకం ఆకాంక్షల కోసం పనిచేస్తా…తుమ్మల

Ram Narayana

ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రామసహాయం ఉరుకులు పరుగులు ….

Ram Narayana

Leave a Comment