Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ వార్తలు

ప్రజలను, ప్రజాసంఘాలను ఆలోచింప చేస్తున్న టీయూడబ్ల్యూజే ఖమ్మం రాష్ట్ర మహాసభలు !

దేశంలో 24 రాష్ట్రాల్లో శాఖలు కలిగి నిరంతరం జర్నలిస్టుల హక్కుల సాధనకై పోరాడుతున్న ఏకైక ఉద్యమసంఘంగా ఉన్న ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ అనుబంధంగా పనిచేస్తున్న తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే) తృతీయ మహాసభలు ఖమ్మం నగరంలో జరగనుండటం ఇక్కడ జర్నలిస్ట్ లోకాన్నే కాకుండా వివిధ రాజకీయపార్టీలను , ప్రజాసంఘాలను , మేధావులను ఆలోచింప చేస్తుంది …కొందరు ఈమహాసభల్లో మీరు ఏమి చర్చించనున్నారు …మీ సమస్యలు ఏమిటి ?రాజకీయ పరమైన అంశాలు చర్చిస్తారా …?అంటూ అడుగుతున్నారు …వివిధ రాజకీయ పార్టీల అభిప్రాయాలు కలిగిన సభ్యులు సమ్మేళనంతో ఉన్న టీయూడబ్ల్యూజే వారికున్న అభిప్రాయాలను బలవంతగా మార్చుకోమని చెప్పడం జరగదు …అదే సందర్భంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న జర్నలిస్టుల హక్కుల కోసం రాజీలేని పోరాటాలు నిర్వహించిన చరిత్ర కలిగి ఉంది ..భవిష్యత్ లో కూడా నిర్వహించనుంది… ఏ ప్రభుత్వంలో తగాదా లేదు…. కానీ జర్నలిస్టుల హక్కుల సాధనకోసం ఎంతదూరమైనా తెగించి పోరాడటానికి సంఘం సిద్ధంగా ఉందని ఈ మహాసభల్లో ప్రతినబునుడం జరుగుతుంది .. అందుకు ఖమ్మం వేదిక కానున్నది ….ఖమ్మంలో జరుగుతున్న ఈసభలు దేశంలోని జర్నలిస్ట్ ఉద్యమానికి మార్గదర్శకంగా ఉండాలని ఆశిద్దాం …

గతంలో ఉమ్మడి రాష్ట్రంలో రెండు సభలు ఖమ్మంలో జరిగినప్పటికీ ప్రస్తుతం మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఉద్యమ కార్యాచరణతో ముందుగు సాగుతున్న టీయూడబ్ల్యూజే రాష్ట్రసభలు జర్నలిస్టుల ఆకాంక్షలకు అనుగుణంగా పలు తీర్మానాలు చేయనున్నది ..

టియూడబ్ల్యూజె(ఐజెయు) 3వ రాష్ట్ర మహాసభలకు ఖమ్మం నగరం ముస్తాబైంది. ఈ నెల 19, 20 తేదీల్లో ఖమ్మంలోని ఉషాహరి కన్వెన్షన్‌(అమరజీవి అమర్‌నాధ్ ప్రాంగణం)లో ఈ మహాసభలు జరుగనున్నాయి. ఈ మేరకు ఆహ్వాన కమిటీ విస్తృత ఏర్పాట్లు చేసింది. ఖమ్మంలోని పలు ప్రాంతాల్లో ప్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రెండు సార్లు రాష్ట్ర మహాసభలకు ఆతిధ్యమిచ్చిన ఖమ్మ జిల్లా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తరువాత తొలిసారిగా ఆతిధ్యమివ్వబోతోంది. 300 మంది ప్రతినిధులు హాజరయ్యే ఈ మహాసభలకు ఆహ్వాన సంఘం ఘనంగా ఏర్పాట్లు చేసింది.

ప్రచారం ముమ్మరం
రాష్ట్ర మహాసభల విజయువంతానికి ఆహ్వాన సంఘం ఘనమైన ఏర్పాట్లతో పాటు ప్రచారం ముమ్మరం చేసింది. నగరంలోని కాల్వొడ్డు, జెడ్పీసెంటర్, ఎన్‌టిఆర్ సర్కిల్, బైపాస్ రోడ్‌లోని పలు ఆర్చిలకు యూనియన్ స్వాగత ప్లెక్సీలు ఏర్పాటు చేశారు. సోమవారం రాత్రి నగరంలోని పలు ప్రాంతాల్లోనూ ప్లెక్సీలు ఏర్పాటు చేశారు. మహాసభలకు హాజైరెన అతిథులకు స్వాగతం పలుకుతూ ప్లెక్సీలు ఏర్పాటు చేయడం గమనార్హం. ఇప్పటికే యూనియన్ స్టిక్కర్లను ఆవిష్కరించి జర్నలిస్టుల్లోకి తీసుకెళ్లిన విషయం విదితమే.

మహాసభలను ప్రారంభించనున్న మంత్రి పొంగులేటి
19న ప్రారంభమయ్యే మహాసభలను రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచార శాఖా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రారంభించనున్నారు. ఆహ్వాన సంఘం అధ్యక్షులు, ప్రముఖ వైద్యులు, సామాజిక వేత్త కూరపాటి ప్రదీప్ స్వాగతోపన్యాసం చేయునున్నారు. జిల్లా విశిష్టత, జర్నలిస్టుల సేవలు, యూనియన్ పోరాటాలు తదితర అంశాలను క్రోడీకరిస్తూ వచ్చిన ప్రతినిధులకు, ఆహ్వానితులకు మహాసభల ఉద్దేశాన్ని వివరించనున్నారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మీడియా అకాడమి చైర్మన్ కె శ్రీనివాస్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు రేణుకా చౌదరి, వద్దిరాజు రవిచంద్ర, డాక్టర్ పార్ధసారధి రెడ్డి, లోక్‌సభ సభ్యుడు రావుసహాయం రఘురాంరెడ్డి, మాజీ ఎంపి నామ నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ తాతా మధు, జెడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు, ఖమ్మం నగర మేయర్ పునుకొల్లు నీరజ, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సిపిఐ ఎం ఎల్ మాస్ లైన్ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు, తానా మాజీ అధ్యక్షులు జయశేఖర్ తాళ్ళూరి, ఐజెయు నాయకులు బల్విందర్ సింగ్ జమ్ము, ఎస్ ఎన్ సిన్హా, దేవులపల్లి అమర్, ఎం ఏ మాజీద్, వై నరేందర్ రెడ్డి, డి సోమసుందర్, కల్లూరి సత్యనారాయణ, అలపాటి సురేశ్ కుమార్, నగునూరి శేఖర్, కె విరాహత్ అలీ తదితర నాయకులు హాజరు కానున్నారు. 20న సాయంత్రంతో మహాసభలు ముగియనున్నాయి. ముగింపు సభకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు హాజరు కానున్నారు.

మహాసభల్లో పలు అంశాలపై తీర్మానాలు
రాష్ట్ర మహాసభల్లో జర్నలిస్టులకు సంబంధించిన పలు అంశాలపై తీర్మానాలు చేయనున్నారు. ఇళ్లస్థలాలు, హెల్త్ కార్డులు, ఉద్యోగ భద్రత తదితర అంశాలపై తీర్మానాలు చేయనున్నారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యల పరిష్కారానికి తగిన కార్యాచరణను ఈ మహాసభల్లో రూపొందించనున్నారు.

Related posts

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ టికెట్స్ ఆశిస్తున్నవారి జాబితా …!

Drukpadam

టీయూడబ్ల్యూజే (ఐజేయూ ) మూడవ మహాసభలకు సిద్దమవుతున్న ఖమ్మం…

Ram Narayana

రూ.100 కోట్లు ఇవ్వొద్దని అదానీకి లేఖ రాశాం.. ఇక తెలంగాణను వివాదాల్లోకి లాగకండి: సీఎం రేవంత్ రెడ్డి

Ram Narayana

Leave a Comment