- పేదోళ్ల ఇండ్లు తప్ప పెద్దోళ్ల భవంతులు కూల్చే ధైర్యం లేదన్న కేటీఆర్
- పెద్దలకో న్యాయం పేదోళ్లకో న్యాయమని ఆరోపణ
- పదేళ్ల కేసీఆర్ పాలనలో నిర్మాణాలు.. కాంగ్రెస్ పాలనలో కూల్చివేతలు
కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకో న్యాయం, పెద్దోళ్లకో న్యాయమనే రీతిలో పనిచేస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. ప్రభుత్వ భూముల పరిరక్షణ పేరుతో హైడ్రా విధ్వంసం సృష్టిస్తోందని మండిపడ్డారు. హైడ్రా చర్యలపై ఆదివారం ఆయన తెలంగాణ భవన్‌లో పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. కేసీఆర్ పదేళ్ల పాలనలో రాష్ట్రంలో నిర్మాణాలు మాత్రమే కనిపిస్తాయి.. కానీ కాంగ్రెస్ పాలనలో కూల్చివేతలే కనిపిస్తున్నాయని విమర్శించారు. కేసీఆర్ పాలనలో సచివాలయం, టీహబ్, వీహబ్, పోలీసు కమాండ్ కంట్రోల్ సెంటర్ నిర్మించామని ఆయన గుర్తుచేశారు. హైదరాబాద్ నగరంలో 42 ఫ్లైఓవర్లు, అండర్ పాస్‌లు నిర్మించామని మాజీ మంత్రి చెప్పారు.

