తెలంగాణ వార్తలు

డీఎస్ లేని లోటు ఎవరూ తీర్చలేరు: సీఎం రేవంత్ రెడ్డి

  • నిన్న హైదరాబాదులో కన్నుమూసిన డీఎస్
  • నేడు నిజామాబాద్ లో అధికార లాంఛనాలతో అంత్యక్రియలు
  • డీఎస్ భౌతికకాయానికి నివాళులు అర్పించిన సీఎం రేవంత్ రెడ్డి

పీసీసీ మాజీ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్ నిన్న కన్నుమూసిన సంగతి తెలిసిందే. 76 ఏళ్ల డీఎస్ నిన్న వేకువ జామున హైదరాబాదులో తుదిశ్వాస విడిచారు. ఇవాళ అధికారిక లాంఛనాలతో డీఎస్ అంత్యక్రియలు నిజామాబాద్ లో నిర్వహించనున్నారు. 

ఈ నేపథ్యంలో, సీఎం రేవంత్ రెడ్డి నిజామాబాద్ లో డీఎస్ భౌతికకాయానికి నివాళులు అర్పించారు. డీఎస్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. డీఎస్ తనయులు సంజయ్, ఎంపీ అర్వింద్ లతో మాట్లాడారు. అనంతరం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.

డీఎస్ లేని లోటును ఎవరూ తీర్చలేరని అన్నారు. డీఎస్ కాంగ్రెస్ పార్టీకి ఎన్నో రకాలుగా సేవలు అందించారని కొనియాడారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో డీఎస్ పాత్ర కీలకం అని పేర్కొన్నారు. డీఎస్ కుటుంబానికి తమ సహాయ సహకారాలు ఉంటాయని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

Related posts

లక్షడప్పులు ,వేల గొంతుకలు ప్రదర్శన వాయిదా… మంద కృష్ణమాదిగ

Ram Narayana

తెలంగాణలో పరీక్షల మధ్యలోనూ స్పెషల్ క్లాసులు.. టెన్త్ విద్యార్థులపై విద్యాశాఖ కొత్త ప్లాన్!

Ram Narayana

నా కొడుకైనా తప్పు చేస్తే శిక్ష తప్పదు: మంత్రి పొంగులేటి..

Ram Narayana