మంత్రి తుమ్మల ముందుచూపు … ఖమ్మంకు మహర్దశ
నలువైపులా రోడ్లతో మారనున్న ఖమ్మం
ఖమ్మం బైపాస్ లో మూడు ఫ్లై ఓవర్లు
80 కోట్లకు కొత్త ప్రతిపాదనలు …తప్పనున్న ట్రాఫిక్ కష్టాలు
సుదీర్ఘ అనుభవం జిల్లా అభివృద్ధిపై మంచి పట్టున్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ముందుచూపుతో ఖమ్మంకు మహర్దశ పట్టనున్నది …అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఘనవిజయం సాధించిన తుమ్మల రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో వ్యవసాయశాఖ మంత్రిగా భాద్యతలు నిర్వహిస్తున్నారు ….సీతారామ ప్రాజెక్ట్ చేసి ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలకు నీరందించడమే లక్ష్యంగా కాంగ్రెస్ లో చేరి ఎన్నికల్లో పోటీచేస్తున్నట్లు తరుచు చెప్పిన తుమ్మల అందుకు అనుగుణంగానే దాన్ని పూర్తిచేసేందుకు వెంటపడ్డారు … దాని ట్రయిల్ రన్ చూసి ఉప్పొంగిపోయారు … తన హయాంలో ఖమ్మంకు ఎదో చేయాలనే తపనలో ఆయన ఉన్నారు …ఇక తుమ్మల శకం ముగిసిందనుకున్న సమయంలో ఖమ్మం ప్రజలు ఇచ్చిన తీర్పు ఆయన భాద్యతను పెంచు ఉత్సాహాన్ని రెట్టింపు చేసింది … ఎన్నికల్లో గెలిచిన తర్వాత తుమ్మలలో స్పష్టమైన మార్పు కనిపిస్తుంది …గతంలో అభివృద్ధిపైనే కేంద్రీకరించిన తుమ్మల ఈసారి ప్రజలతో మమైకమవుతున్నారు … తరుచు నియోజకవర్గ కేంద్రంలో ఉంటూ ప్రజలను కలుస్తున్నారు …ఖమ్మంలో ఉంటె క్యాంపు కార్యాలయంలో ఎక్కువసమయం గడుపుతున్నారు … ఎన్నికల్లో తనకు సహకరించిన వాళ్ళ ఇళ్లకు వెళ్లి కృతజ్నతలు తెలిపారు ..ఆపదలో ఉన్నవారికి నేనున్నాననీ భరోసా కల్పిస్తున్నారు …
మంత్రిగా పనిచేసిన అపార అనుభవం ఉన్న తుమ్మల అందుకు అనుగుణంగానే ఉమ్మడి ఖమ్మం జిల్లా అభివృద్ధిపై ఫోకస్ పెంచారు …తన హయాంలో ప్రారంభమైన భద్రాచలం వద్ద రెండవ బ్రిడ్జి పనులు ఆగిపోతే ఆయన తిరిగి మంత్రి కాగానే అధికారుల కాంట్రాక్టర్ల వెంటపడి దాన్ని పూర్తీ చేయించారు ….అది కూడా ప్రారంభానికి సిద్ధంగా ఉంది ..సీతారాం ప్రాజెక్ట్ తోపాటు దాన్నికూడా ప్రారంభించే అవకాశం ఉంది ….
ఖమ్మం నగర అభివృద్ధిపై ఆయనకు సంపూర్ణ అవగాహన ఉండటంతో గతంలో మిగిలిపోయిన అభివృద్ధి పనులను పూర్తీ చేయించడంతోపాటు కొత్త ప్రణాళికలు రూపొందిస్తున్నారు …కొత్త మెడికల్ కాలేజీ భవనాలు ,ఇరుగ్గా ఉన్న రోడ్లను ఎడల్పు చేయడంతోపాటు గతంలోనే మంజూరి అయినా ఖమ్మం మునేరు పాత బ్రిడ్జి స్థానే తీగల బ్రిడ్జి నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి…అదే విధంగా ఖమ్మం మునేరు నీరు ముంపుప్రాంతాలకు రాకుండా నిర్మిస్తున్న రిటైనింగ్ వాల్ పై నిరంతరం సమక్షలు చేస్తున్నారు … ఖమ్మంకు నాలుగువైపులా నేషనల్ హైవే రోడ్లు వస్తుందున రింగురోడ్డు నిర్మించాలనే పట్టుదలతో ఉన్నారు …గతంలోనే ఆయన చేసిన ప్రతిపాదనలు అప్పటి ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల నిలిచిపోయాయి… ఖమ్మంకు ట్రాఫిక్ కష్టాలు తప్పించాలనే ఆలోచనతో ఖమ్మం బైపాస్ రోడ్ లో రైల్వే బ్రిడ్జి , ఎన్టీఆర్ సర్కిల్ ,శ్రీశ్రీ సర్కిల్ వద్ద , ఫ్లై ఓవర్లు నిర్మించాలనే ఆలోచన చేస్తున్న తుమ్మల అందుకు అనుగుణంగా 80 కోట్ల రూపాయలకు ప్రతిపాదనలు సిద్ధం చేసి ముఖ్యమంత్రి ఆమోదం కోసం పంపారు … మునేరు పై బైపాస్ లో మరో బ్రిడ్జి నిర్మించాల్సిన అవసరం ఉంది …తుమ్మల మదిలో ఉన్న అభివృద్ధి పనులు బ్రిడ్జి లు ,ఫ్లై ఓవర్లు కార్యరూపం దాల్చితే ఖమ్మంకు మహర్దశ పెట్టినట్లే అని చెప్పక తప్పదు …