Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఖమ్మం వార్తలు

నాలుగేళ్లలో పేదలకు 20 లక్షల ఇందిరమ్మ ఇళ్ళు…మంత్రి పొంగులేటి

అర్హులైన పేదలకు రాబోయే నాలుగు సంవత్సరాలలో 20 లక్షల ఇందిరమ్మ ఇండ్ల రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌరసంబంధాల శాఖామాత్యులు శ్రీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి
*కూసుమంచిలో నిర్మించిన ఇందిరమ్మ ఇల్లు మోడల్ హౌజ్ నిర్మాణం, దుబ్బతండ లో నిర్మించిన గృహ సముదాయ భవనాలను ప్రారంభోత్సవం చేసిన మంత్రి పొంగులేటి

అర్హులైన పేదలకు రాబోయే నాలుగు సంవత్సరాలలో 20 లక్షల ఇందిరమ్మ ఇండ్లను నిర్మిస్తామని రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌరసంబంధాల శాఖామాత్యులు శ్రీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు.

సోమవారం, ఖమ్మం ఎం.పి. రామసహాయం రఘురాం రెడ్డి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డా. పి. శ్రీజ లతో కలిసి కూసుమంచి మండలంలో పర్యటించి కూసుమంచిలో 5 లక్షలతో నిర్మించిన ఇందిరమ్మ ఇల్లు మోడల్ హౌజ్ నిర్మాణం, దుబ్బతండలో 146.16 లక్షలతో నిర్మించిన గృహ సముదాయాలను ప్రారంభోత్సవం చేశారు.

ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ, ప్రపంచంలో తెలుగు మాట్లాడే ప్రతి ఒక్కరికీ, ప్రజలందరికీ సంక్రాంతి పండుగ సుఖ సంతోషాలతో ఉండాలని అన్నారు.

పేదోడి చిరకాల స్వప్నం గత పదేళ్ల కాలంలో అలానే నిలిచి పోయిందని, 2004 నుంచి 2014 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ ప్రాంత పరిధిలో 25 లక్షల 60 వేల ఇందిరమ్మ ఇండ్లను నిర్మించామని, ప్రజలు మార్పు కావాలని ఆకాంక్షించి 2023 ఎన్నికల సమయంలో ఇందిరమ్మ రాజ్యానికి పట్టం కట్టారని అన్నారు.

ఇందిరమ్మ రాజ్యం అంటేనే ఇందిరమ్మ ఇండ్లు, పేదవాడి చిరకాల ఆకాంక్షను నెరవేర్చె దిశగా కృషి చేస్తున్నామని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకపోయినా, క్రమశిక్షణ పాటిస్తూ పేద ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు మొదటి సంవత్సరంలోనే నాలుగు లక్షల 50 వేల ఇండ్లు నిర్మించాలని దృఢ సంకల్పంతో ఉన్నామన్నారు.

ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో 3500 కు తక్కువ కాకుండా ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తున్నామని, ఇంటి నిర్మాణం సంబంధించి ఆర్థిక సహాయం గ్రీన్ చానెల్ ద్వారా పెండింగ్ లేకుండా ఎప్పటి కప్పుడు చెల్లించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. శంకుస్థాపన చేసిన నమూనా ఇంటిని పండుగ సందర్భంగా ఈ రోజు ప్రారంభిస్తున్నామని తెలిపారు.

రాబోయే నాలుగు సంవత్సరాలలో తమ ప్రభుత్వం 20 లక్షలకు తగ్గకుండా పేదల కోసం ఇండ్లు నిర్మిస్తుందని అన్నారు. గతంలో ప్రారంభించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పనులు పూర్తి చేసి అర్హులకు పంపిణీ చేస్తున్నామని అన్నారు. కుల, మతాలు, రాజకీయాలకు అతీతంగా అర్హులైన పేదలకు ఎక్కడా దళారీలకు ఆస్కారం లేకుండా ఇండ్లు మంజూరు చేస్తామని అన్నారు.

ఇందిరమ్మ ఇండ్ల క్రింద సొంత స్థలం ఉన్నవారికి 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం 4 విడత లలో అందుతుందని, ఫౌండేషన్ వేసిన తర్వాత లక్ష రూపాయలు, కిటికిల దశకు వచ్చాక లక్ష పాతిక వేలు, స్లాబ్ దశ చేరిన తర్వాత లక్ష 75 వేల రూపాయలు, ఇళ్లు పూర్తి చేసిన తర్వాత మరో లక్ష రూపాయలు, మొత్తం ఐదు లక్షల సహాయం పేదలకు ఇంటి కోసం అందుతుందని అన్నారు.

రాష్ట్ర కేబినెట్ నిర్ణయం మేరకు జనవరి 26 నుంచి 4 పథకాలను అమలు చేస్తున్నామని అన్నారు. రైతు భరోసా క్రింద వ్యవసాయ యోగ్యమైన ప్రతి ఎకరాకు 12 వేల ఆర్థిక సహాయం, రైతు కూలీల కుటుంబాలకు సంవత్సరానికి 12 వేలు, అర్హులైన పేదలకు నూతన రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల పథకం ప్రారంభమవుతుందని అన్నారు.

అనంతరం మంత్రి కూసుమంచి మండలం దుబ్బతాండ లో రూ. 146.16 లక్షల వ్యయంతో నిర్మించిన 29 ఇండ్లను ప్రారంభోత్సవం చేశారు. ఇండ్ల నిర్మాణంతో పాటు మౌళిక వసతుల కల్పన చేస్తున్నట్లు మంత్రి తెలిపారు.

కార్యక్రమంలో ఎంపి రామసహాయం రఘురాం రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి పట్టుదలతో ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ప్రవేశ పెట్టారని అన్నారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజలకు ఇచ్చిన గ్యారెంటీ పథకాల అమలు చేస్తున్నారని అన్నారు. జనవరి 26 నుంచి 4 కొత్త పథకాలను ప్రారంభిస్తున్నామని అన్నారు.

కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డా. పి. శ్రీజ మాట్లాడుతూ, పేదలకు సౌకర్యవంతంగా ఉండే విధంగా 400 చదరపు అడుగుల స్థలంలో 5 లక్షల రూపాయలతో నమూనా ఇందిరమ్మ ఇండ్లు నిర్మించడం జరిగిందని, ప్రతి మండలంలో నమూనా ఇందిరమ్మ ఇండ్లు నిర్మిస్తున్నామని, పేద ప్రజలకు అందించే 5 లక్షల రూపాయలతో ఇండ్లు పూర్తవుతుందనే విశ్వాసం కల్పించేలా నమూనా ఇల్లు ఉందని అన్నారు.

మంత్రి చేతుల మీదుగా శంకుస్థాపన జరిగిన ఇంటి నిర్మాణ పనులను 20 రోజుల వ్యవధిలో నమూనా ఇంటి నిర్మాణం పూర్తి చేసేందుకు కృషి చేసిన ఈఈ పంచాయతీ రాజ్ కు అదనపు కలెక్టర్ ప్రత్యేక అభినందనలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఖమ్మం ఆర్డీవో నర్సింహారావు, నియోజకవర్గ ప్రత్యేక అధికారి రమేష్, హౌజింగ్ పిడి బి. శ్రీనివాసరావు, పీఆర్ ఇఇ వెంకట్ రెడ్డి, డిపిఓ ఆశాలత, ఇంచార్జ్ తహసీల్దార్ కరుణశ్రీ, మార్కెట్ కమిటీ చైర్మన్ సీతారాములు, అధికారులు,
ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

Related posts

తన గెలుపును ఎవరు ఆపలేరు … పాలేరు బీఆర్ యస్ అభ్యర్థి కందాల ఉపేందర్ రెడ్డి!

Ram Narayana

మంత్రి పువ్వాడకు బిగ్ షాక్ …రఘునాథపాలెం ఎంపిపి కాంగ్రెస్ లో చేరిక..!

Ram Narayana

సకాలంలో గుర్తిస్తే క్యాన్సర్‌తో ప్రమాదం లేదు…

Ram Narayana

Leave a Comment