Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రైమ్ వార్తలు

ఆపరేషన్​ ట్రోజన్​ షీల్డ్​: ప్రపంచ వ్యాప్తంగా 800 మంది నేరస్థుల అరెస్ట్​!

ఆపరేషన్​ ట్రోజన్​ షీల్డ్​: ప్రపంచ వ్యాప్తంగా 800 మంది నేరస్థుల అరెస్ట్​!
-నేరగాళ్లకు ఇక చుక్కలే … వారి నేరాలకు అడ్డుకట్టలో ముందడుగు
‘యానోమ్’ ఫోన్లతో ఎఫ్ బీఐ సీక్రెట్ ఆపరేషన్
మెసేజ్ లు, ఫొటోల ఆధారంగా నేరాలకు బ్రేక్
16 దేశాల్లోని ముఠాల సభ్యులు అరెస్ట్
క్రిమినల్స్ తోనే క్రిమినల్స్ కు ఫోన్ల అమ్మకాలు

ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు.. 800 మంది నేరస్థులు అరెస్టయ్యారు. అది మామూలు నేరం కాదు.. ఒక ప్రదేశానికే పరిమితం కాలేదు. ఒక దేశం నుంచి మరో దేశానికి లింకై ఉన్న నేరాలవి. 16 దేశాల్లో ఆసియా క్రైమ్ సిండికేట్లు, మోటార్ సైకిల్ ముఠాలు, ఇతర నేరాల నెట్ వర్క్ లకు చెందిన నేరస్థులు అరెస్టయ్యారు. ఇంత పెద్ద ముఠా గుట్టు మామూలుగా రట్టు కాలేదు. దీంతో ఇక నేరగాళ్లకు చుక్కలే …. నేరాలకు అడ్డుకట్ట వేయడంలో ఇదో ముందడుగు అంటున్నారు…

అమెరికా ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్ బీఐ), ఆస్ట్రేలియా దర్యాప్తు సంస్థలు కలిసి వారిపై నిఘా పెట్టాయి. ‘ఆపరేషన్ ట్రోజన్ షీల్డ్’ను నిర్వహించాయి. వారి ఫోన్లలో సందేశాలు, చాటింగ్ లు, ఫొటోలపై ఓ లుక్కేశాయి. 150 హత్యలను నివారించాయి. డ్రగ్స్ దందాను చాలా వరకు నిలువరించాయి. 250 ఆయుధాలను స్వాధీనం చేసుకున్నాయి. 4.8 కోట్ల డాలర్ల సొమ్మును సీజ్ చేశాయి.

పెద్ద ప్లాను.. యానోమ్ ఫోన్ యాప్ లు

నేరస్థుల ఆట కట్టించేందుకు దర్యాప్తు సంస్థలు పెద్ద ప్లానే వేశాయి. వాస్తవానికి నేరస్థులు ఇంతకుముందు ఫాంటమ్ సెక్యూర్, ఎంక్రోచాట్, స్కై గ్లోబల్ వంటి ఎన్ క్రిప్టెడ్ ఫోన్లను వాడేవారు. అయితే, వాటిని అధికారులు సులభంగా ఛేదించేశారు. ఈ నేపథ్యంలోనే నేరస్థులు ‘యానోమ్’ అనే ఫోన్ల వైపు మళ్లారు. దీంతో ఆ ఫోన్లనే ఆయుధాలుగా చేసుకున్నారు అధికారులు. నేరస్థుల ద్వారానే నేరస్థులకు అధికారులు తయారు చేసిన యానోమ్ ఫోన్లు అందేలా చూశారు. మొదట 50 డివైస్ లను ఆస్ట్రేలియాలో ఇచ్చి టెస్ట్ చేశారు.

క్రిమినల్స్ కు ఒక్కో డివైస్ ను 2 వేల డాలర్లకు అమ్మారు. ఆరు నెలలకోసారి 1,300 డాలర్ల నుంచి 2,100 డాలర్ల యూజర్ ఫీజును వసూలు చేశారు. ఆ ఫోన్ లో ఈమెయిల్స్ గానీ, జీపీఎస్ గానీ, కాల్స్ వంటి సేవలేవీ అందుబాటులో ఉండవు. కేవలం మెసేజ్ లు, ఫొటోలతో మాత్రమే సమాచార మార్పిడి చేసుకునేందుకు అవకాశం ఉంటుంది.

అలా కొన్ని రోజుల్లోనే చాలా ముఖ్యమైన సమాచారాన్ని అధికారులు పొందగలిగారు. వందలాది ఫొటోలు, వేలాది సందేశాల ఆధారంగా నేరాలను నిలువరించారు. 200 మందిని ఆస్ట్రేలియా అరెస్ట్ చేసింది. ఆ తర్వాత అవే ఫోన్ల ద్వారా స్వీడన్ లో 155 మంది, జర్మనీలో 70 మంది, నెదర్లాండ్స్ లో 49 మంది, న్యూజిలాండ్ లో 35 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఫిన్లాండ్ లో 100 మందిని కటకటాల వెనక్కు నెట్టారు. ప్రస్తుతం దీనిపై ఇంకా దర్యాప్తు సాగుతోందని అమెరికా న్యాయశాఖ పేర్కొంది.

Related posts

హైదరాబాద్‌లో ఉన్న భార్యపై లండన్ నుంచి భర్త విష ప్రయోగం

Ram Narayana

ఆత్మరక్షణ కోసమే క్యాబ్ డ్రైవర్‌పై చేయి చేసుకున్నా.. చెంపదెబ్బ కేసులో యువతి ట్విస్ట్!

Drukpadam

బిగ్‌బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్, అతడి సోదరుడి అరెస్ట్

Ram Narayana

Leave a Comment