Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆఫ్ బీట్ వార్తలు

ఫ్రాన్స్ లో 1,300 ఏళ్ల నాటి ‘మాయా ఖడ్గం’ అదృశ్యం!

  • ప్రపంచంలోకెల్లా అత్యంత పదునైన, నాశనంలేని కత్తిగా పేరు
  • 100 అడుగుల ఎత్తయిన బండరాయిలో సగం దిగబడిన డురంగల్
  • చోరీకి గురవడంపై స్థానికుల ఆందోళన.. దర్యాప్తు మొదలుపెట్టిన పోలీసులు

ప్రపంచంలోకెల్లా అత్యంత పదునైనదిగా, నాశనం కానిదిగా అభివర్ణించే పురాతన ఫ్రెంచ్ ఖడ్గం అదృశ్యమైంది. రోకమడోర్ అనే పట్టణంలో 1,300 ఏళ్లుగా ఓ 100 అడుగుల ఎత్తయిన బండరాయిలోకి సగం దిగబడిన కత్తి చోరీకి గురైనట్లు స్థానికులు భావిస్తున్నారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అయితే 100 అడుగుల ఎత్తుకు ఎక్కి ఆ ఖడ్గాన్ని దొంగిలించడం ఎలా సాధ్యమో అంతుబట్టక తలలుపట్టుకుంటున్నారు. ఇప్పటివరకు ఈ పట్టణానికి అతిపెద్ద టూరిస్ట్ అట్రాక్షన్ గా ఈ ఖడ్గం, దాని చరిత్ర నిలిచాయి. ఇప్పుడు ఆ కత్తి అదృశ్యం కావడంతో స్థానికులు తమ విధిరాత ఎలా మారుతుందోనని కలవరపడుతున్నారు. వందల ఏళ్లుగా తమ పట్టణ చరిత్రతో ముడిపడి ఉన్న ఆ ఖడ్గం గురించి ప్రతి టూరిస్ట్ గైడ్ వివరించకుండా ఉండేవారు కాదని పట్టణ మేయర్ డోమినిక్ లెన్ ఫెంట్ చెప్పారు.

డురండల్ గా పిలిచే ఆ ఖడ్గానికి ఫ్రెంచ్ ఎక్స్ క్యాలిబర్ అని కూడా పేరుంది. స్థానిక స్థల పురాణం ప్రకారం ఆ ఖడ్గానికి అతీంద్రియ శక్తులు ఉన్నాయి. ఒక్క వేటుతో రాతిని కూడా అది రెండుగా చీల్చగలదు. 8వ శతాబ్దంలో ఆ ఖడ్గాన్ని ఓ దైవదూత నాటి రోమన్ చక్రవర్తి చార్ల్ మేగ్నెకి అందించింది. ఆ తర్వాత కొంతకాలానికి ఆయన ఆ ఖడ్గాన్ని తన అత్యుత్తమ సైనికుడైన రోలాండ్ కు బహూకరించారు. అయితే యుద్ధంలో మరణించే ముందు రోలాండ్ ఆ ఖడ్గం శత్రువుల చేతికి చిక్కరాదని భావించి దాన్ని విరగ్గొట్టాలనుకున్నాడు. కానీ అది సాధ్యంకాకపోవడంతో అసహనానికి లోనై దాన్ని గాల్లోకి విసిరాడు. దీంతో ఆ కత్తి గాల్లో కొన్ని వందల కిలోమీటర్ల దూరం ప్రయాణించి చివరకు రొకమడోర్ పట్టణంలోని రాతికొండలో దిగబడింది.

11వ శతాబ్దం నాటి ఫ్రెంచ్ సాహిత్యంలోనూ డురండల్ మాయాశక్తుల ప్రస్తావన ఉంది. ద సాంగ్ ఆఫ్ రోలాండ్ పేరిట ఉన్న ఓ పద్యం తాలూకు కాపీ ప్రస్తుతం ఆక్స్ ఫర్డ్ లోని బోడ్లియన్ లైబ్రరీలో ఉంది.

Related posts

రహస్య కెమెరాతో మహిళల నగ్న చిత్రాలు.. అమెరికాలో భారతీయ వైద్యుడి అరాచకం..

Ram Narayana

 గొంతు నొప్పితో హాస్పిటల్‌కు వెళ్లిన మహిళకు కలలో కూడా ఊహించని షాక్…

Ram Narayana

లంచ్ బాక్స్ మరచిపోయారంటూ ఆఫీస్‌కు వెళుతున్న భర్తకు భార్య ఫోన్.. అదృష్టం తలుపు తట్టింది!

Ram Narayana

Leave a Comment