Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
జాతీయ వార్తలు

నిఘా వర్గాల హెచ్చరికతో రాహుల్ గాంధీ ఇంటి వద్ద హై సెక్యూరిటీ-

నిఘావర్గాల హెచ్చరికలతో లోకసభలో విపక్షనేత రాహుల్ గాంధీకి ప్రమాదం పొంచిఉందన్న సమాచారంతో ఢిల్లీలోని ఆయన ఇంటివద్ద హై సెక్యూర్టీ భద్రత ఏర్పాటు చేశారు …ఇటీవల లోకసభలో బీజేపీ విధానంపై రాహుల్ గాంధీ తన ప్రసంగంలో శివమెత్తారు …బీజేపీ ,ఆరెస్సెస్ విధానాలను పార్లమెంట్ వేదికగా తూర్పార బట్టారు … ఆయన ప్రసంగానికి అధికార పక్షం మద్యమద్యలో అడ్డుతగిలినా ఆపలేదు … దీంతో మితవాద గ్రూప్ లనుంచి ప్రమాదం పొంచి ఉండవచ్చుననే నిఘావర్గాల సమాచారం మేరకు ఢిల్లీ పోలీసులు ఆయన ఇంటివద్ద భద్రత పెంచారు …అదనపు పోలీస్ బలగాలను మోహరించారు … రాహుల్ గాంధీకి ఇంతటి భద్రత కల్పించడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం …

స్థానిక పోలీసులతో పాటు ఒక ప్లాటూన్‌ పారామిలిటరీ బలగాలను ఆయన నివాసం చుట్టూ మోహరించారు. లోక్‌సభలో సోమవారం ప్రసంగించిన రాహుల్‌గాంధీ, భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఆ పార్టీ శ్రేణులు రాహుల్‌ నివాసం వద్ద ఆందోళనకు దిగే ప్రమాదం ఉందన్న సమాచారం మేరకు భద్రతను పెంచారు. రాహుల్‌ నివాసం చుట్టూ 24 గంటలు అప్రమత్తంగా ఉండాలని స్థానిక పోలీసులకు సూచించారు. జెడ్‌ ప్లస్‌ భద్రత కలిగిన రాహుల్‌కు సీఆర్​పీఎఫ్ బృందాలు భద్రత కల్పిస్తున్నాయి.

Related posts

రామ సేతు తీరంలో ప్రధాని మోదీ.. !

Ram Narayana

రైతుల కోసం కేంద్రాన్ని ప్రశ్నించిన ఉపరాష్ట్రపతి…

Ram Narayana

రాహుల్ కు పెళ్లి చేద్దామా? అనే ప్రశ్నకు సోనియాగాంధీ సమాధానం ఇదే

Ram Narayana

Leave a Comment