Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ రాజకీయ వార్తలు ..

బీఆర్ ఎస్ కు బిగ్ షాక్ ….6 గురు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ గూటికి!

బీఆర్‌ఎస్‌ పార్టీకి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. ఆ పార్టీ నేతలు ఒక్కొక్కరుగా ‘కారు’ దిగిపోతున్నారు. హస్తం గూటికి చేరుతున్నారు. గురువారం అర్ధరాత్రి ఒంటిగంట తర్వాత ఆరుగురు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీలు కాంగ్రెస్‌ కండువా కప్పుకొన్నారు. దీంతో బీఆర్ యస్ కు బిగ్ షాక్ తగిలినట్లు అయింది …

బీఆర్ యస్ కు చెందిన మండలి సభ్యులు దండే విఠల్‌, భానుప్రసాద్‌, బుగ్గారపు దయానంద్‌, ప్రభాకర్‌రావు, ఎగ్గే మల్లేశం, బస్వరాజు సారయ్యలు అధికార పార్టీలో చేరారు. వీరంతా గురువారం రాత్రి సీఎం రేవంత్‌రెడ్డి నివాసానికి చేరుకున్నారు. ఆయన ఢిల్లీ నుంచి రావాల్సిన విమానం ఆలస్యమైంది. అర్ధరాత్రి దాటింది. అప్పటి వరకు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీలు రేవంత్‌ నివాసంలోనే ఉన్నారు. ఢిల్లీ నుంచి రాగానే ఆయనతో భేటీ అయ్యారు. ఆరుగురు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీల చేరికతో శాసనమండలిలో కాంగ్రెస్‌ బలం 12కు చేరింది. మండలిలో కూడా ఆధిక్యం కోసం కాంగ్రెస్‌ పార్టీ పావులు కదుపుతోంది.

తెలంగాణ శాననమండలిలో మొత్తం సభ్యులు 40 మంది కాగా వీరిలో ఆరుగురు సభ్యులను గవర్నర్ నామినేట్ చేస్తారు …మిగతా 34 మందిని స్థానికసంస్థలనుంచి , ఉపాధ్యా , గ్రాడ్యువేట్లు,శాసనసభ్యుల నుంచి ఎన్నికవుతారు … అయితే ఇప్పుడు బీఆర్ యస్ సభ్యులు 29 మంది ఉన్నారు ..అయితే వారి నుంచి 6 గురు పార్టీని వీడి కాంగ్రెస్ చేరారు …దీంతో బీఆర్ యస్ బలం 23 కు పడిపోయింది …మరో 4 గురు కాంగ్రెస్ లో చేరితే మండలిలో బిల్లులు పాస్ చేయించుకోవడం అధికార పార్టీకి సులువు అవుతుంది …దానికోసం కాంగ్రెస్ వ్యూహాత్మకంగా పావులు కదుపుతుంది ..

Related posts

కేసీఆర్ కుటుంబం తెలంగాణ అమరుల రక్తపు కూడు తింటోంది: జూపల్లి

Ram Narayana

గజ్వేల్‌లో పోటీ చేస్తానని ఈటల ప్రకటించడంతో కేసీఆర్‌కు దడ పుట్టింది: ధర్మపురి అర్వింద్

Ram Narayana

తుమ్మల కాంగ్రెస్ లోకి స్వాగతిస్తాం …పొదెం వీరయ్య …!

Ram Narayana

Leave a Comment