Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ వార్తలు

ఇక నుంచి ఏడాదికి రెండుసార్లు టెట్… తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం

  • ప్రతి సంవత్సరం జూన్‌లో ఓసారి, డిసెంబర్‌లో మరోసారి నిర్వహించాలని నిర్ణయం
  • ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ విద్యాశాఖ
  • టెట్ మార్కులతో డీఎస్సీలో వెయిటేజీ

ఏడాదికి రెండుసార్లు టెట్ (టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్) నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు విద్యాశాఖ శనివారం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతి సంవత్సరం జూన్ నెలలో ఓసారి, డిసెంబర్ నెలలో మరోసారి టెట్ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఒక అభ్యర్థి ఎన్నిసార్లు అయినా టెట్ పరీక్ష రాయవచ్చునని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

టెట్‌లో ఉత్తీర్ణత సాధించిన వారికే డీఎస్సీ రాయడానికి అవకాశం కల్పించనున్నారు. టెట్ మార్కులకు డీఎస్సీలో వెయిటేజీ ఇవ్వనున్నారు. గతంలో, నేషనల్‌‌‌ కౌన్సిల్‌‌‌ ఫర్‌‌‌ టీచర్‌‌‌ ఎడ్యుకేషన్‌‌‌ (ఎన్సీటీఈ) ప్రతి సంవత్సరం రెండుసార్లు టెట్‌‌‌ నిర్వహించాలని రాష్ట్రాలను ఆదేశించింది. అలాగే కేంద్ర ప్రభుత్వం టెట్ గడువును జీవితకాలానికి పెంచింది. దీంతో ఒక్కసారి క్వాలిఫై అయితే, మరోసారి రాయాల్సిన అవసరం లేదు. టెట్ మార్కులకు డీఎస్సీలో వెయిటేజీ ఉండటంతో కేవలం ఇప్పటికే టెట్ క్వాలిఫై అయిన అభ్యర్థులు తమ స్కోర్ పెంచుకునేందుకు మాత్రం రాసుకోవచ్చు.

Related posts

తెలంగాణను కీలక స్థావరంగా ఎంచుకున్న నావికాదళం… వికారాబాద్ జిల్లాలో నేవీ రాడార్ స్టేషన్

Ram Narayana

వాళ్ల పేర్లు చెప్పాలని కవితపై ఒత్తిడి:ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్

Ram Narayana

సీఎం సొంతూరులో మహిళా జర్నలిస్ట్‌లపై దాడి… స్పందించిన మహిళా కమిషన్!

Ram Narayana

Leave a Comment