బీఆర్ యస్ కు షాకుల మీద షాకులు …గద్వాల్ ఎమ్మెల్యే పార్టీకి గుడ్ బై
కాంగ్రెస్ లో చేరిక …అదే బాటలో మరికొందరు
ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు , ఎమ్మెల్సీల చేరిక
వారి అవసరం కొద్దీ పోతున్నారన్న బీఆర్ యస్ నేత కేసీఆర్
బీఆర్ యస్ కు షాకులమీద షాకులు తగులుతున్నాయి….ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు బీఆర్ యస్ కు బై చెప్పి కాంగ్రెస్ చేరగా తాజాగా గద్వాల్ ఎమ్మెల్యే చేరిక చర్చనీయాంశంగా మారింది …ఎమ్మెల్సీలు కూడా బీఆర్ యస్ ను వీడుతున్నారు …దీంతో బీఆర్ యస్ భవితవ్యం పై ఆందోళన నెలకొన్నది …రంగారెడ్డి , హైద్రాబాద్ కు చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు మంత్రి శ్రీధర్ బాబు ను కలిసి చర్చించారు …వారు కూడా రేపో మాపో బీఆర్ యస్ విడనున్నట్లు సమాచారం …అయితే తమ పార్టీ నుంచి ఎమ్మెల్యేలు , ఎమ్మెల్సీలు వెళ్లడంపై అధినేత కేసీఆర్ స్పందించారు ..వాళ్ల అవసరాల కొద్దీ వెళ్ళుతుంటారని దాన్ని గురించి బాధపడాల్సిన పనిలేదని అన్నారు ..
గద్వాల భారాస ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. జూబ్లీహిల్స్‌లోని ముఖ్యమంత్రి నివాసంలో అయనకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మూడు రోజుల క్రితం కృష్ణ మోహన్ రెడ్డి తన అనుచరులతో సమావేశమై కాంగ్రెస్ పార్టీలో 6వ తేదీన చేరుతున్నట్లు ప్రకటించారు. దీంతో స్థానిక గద్వాల నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.
ఎమ్మెల్యే చేరికను వ్యతిరేకిస్తున్న స్థానిక నేతలు : రెండు రోజులుగా మాజీ జడ్పీ చైర్ పర్సన్ సరితా తిరుపయ్య ఆమె అనుచరులకు నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. మరోక వైపు రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ దీపాదాస్ మున్సీ కూడా సరితా తిరుపతయ్యతో ఫోన్ లో మాట్లాడి సర్ది చెప్పారు. ఇవాల కూడా గద్వాల కాంగ్రెస్ నాయకులతో సమావేశమై వారందరికి నచ్చ చెప్పిన తర్వాతనే కృష్ణ మోహన్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలోకి చేర్చుకున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. సీఎం నివాసంలో కృష్ణ మోహన్ రెడ్డి పార్టీలో చేరిన సమయంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్ రెడ్డి, దానం నాగేందర్ ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు రోహిన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.