Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
జాతీయ వార్తలు

రాధికా మర్చంట్ మెడలో తాళికట్టిన అనంత్ అంబానీ.. అంగరంగ వైభవంగా జరిగిన పెళ్లి

  • అతిరథ మహారథులతో గ్రాండ్‌గా జరిగిన పెళ్లి
  • బారాత్ ఊరేగింపుతో వివాహ వేదికగా వద్దకు చేరుకున్న అనంత్ అంబానీ
  • రజనీ కాంత్, షారుఖ్ ఖాన్ సహా డ్యాన్స్ వేసిన పలువురు ప్రముఖులు

యావత్ దేశం దృష్టిని ఆకర్షించిన ముకేశ్ అంబానీ తనయుడు అనంత్ అంబానీ పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. ఫార్మాస్యూటికల్ దిగ్గజాలు వీరేన్, శైలా మర్చంట్‌ల కుమార్తె, తన చిన్ననాటి స్నేహితురాలైన రాధికా మర్చంట్ మెడలో అనంత్ అంబానీ శుక్రవారం రాత్రి తాళి కట్టారు. శుక్రవారం ముంబైలోని జియో వరల్డ్ డ్రైవ్ కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన ఈ వివాహ వేడుకలో ప్రపంచవ్యాప్తంగా రాజకీయ, సినీ, క్రీడా, ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు.

అనంత్ అంబానీ ప్రత్యేకంగా డిజైన్ చేసిన నారింజ రంగు షేర్వానీ ధరించారు. తన నివాసం యాంటిలియా నుంచి సుందరంగా అలంకరించిన ఎరుపు రంగు కారుపై సంగీతం, నృత్యాల మధ్య ఊరేగింపుగా కన్వెన్షన్ సెంటర్‌కు చేరుకున్నారు. అనంతరం హిందూ సాంప్రదాయం ప్రకారం వివాహం జరిగింది. బారాత్ ఊరేగింపులో కేవలం సంప్రదాయ ఆచారాలకే పరిమితం కాలేదు. పలువురు సెలబ్రిటీలు డ్యాన్స్ చేశారు. అమెరికా నటుడు, రాపర్ జాన్ సెనా, సూపర్ స్టార్ రజనీకాంత్, బాలీవుడ్ నటులు అనిల్ కపూర్, రణవీర్ సింగ్‌తో పాటు పెళ్లి కొడుకు అనంత్ అంబానీ కూడా డ్యాన్స్ వేశారు. ఇక కింగ్ షారుఖ్ ఖాన్ నీతా అంబానీతో కలిసి చేసిన డ్యాన్స్ ప్రత్యేకంగా ఆకట్టుకుంది.

జులై 14న గ్రాండ్ రిసెప్షన్..
కొన్ని నెలలుగా అనంత్ అంబానీ – రాధికా మర్చంట్‌ల వివాహానికి సంబంధించిన వేడుకలు జరుగుతున్నాయి. అనేక కార్యక్రమాలు నిర్వహించిన విషయం తెలిసిందే. శుక్రవారం రాత్రి పెళ్లి ఘట్టం ముగిసింది. ఇక విందు మాత్రమే మిగిలివుంది. ఇవాళ (శనివారం) ఎంపిక చేసిన కొంతమంది సన్నిహిత అతిథులకు విందు కార్యక్రమాన్ని సిద్ధం చేశారు. రేపు (ఆదివారం) గ్రాండ్ రిసెప్షన్‌ను ఏర్పాటు చేశారు.

అనంత్ అంబానీ పెళ్లి రిసెప్షన్‌కు సీఎం చంద్రబాబు

CM Chandrababu will go to Anant Ambani and Radhika Marchant wedding reception in Mumbai
  • శనివారం రాత్రి ముంబైలో జరగనున్న రిసెప్షన్
  • కార్యక్రమానికి హాజరై రాత్రికి ముంబైలోనే బస చేయనున్న ఏపీ సీఎం
  • ఆదివారం మధ్యాహ్నం తిరుగుపయనం
  • పెళ్లికి హాజరయ్యేందుకు శుక్రవారమే ముంబై చేరుకున్న మంత్రి నారా లోకేశ్!

ప్రపంచ సంపన్నుల్లో ఒకరు, రిలయన్స్‌ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అధినేత ముఖేశ్‌ అంబానీ తనయుడు అనంత్ అంబానీ-రాధిక మర్చంట్‌ల వివాహం శుక్రవారం రాత్రి అంగరంగ వైభవంగా పూర్తయింది. ఇవాళ (శనివారం) రాత్రి ముంబైలో కొంతమంది అతిథులకు రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు హాజరు కానున్నారు. ఈ రోజు సాయంత్రం ముంబైకి చేరుకుని రాత్రి రిసెప్షన్‌లో పాల్గొంటారు. రాత్రికి ముంబైలోనే బస చేసి మరుసటి రోజు మధ్యాహ్నం ఆయన అమరావతి చేరుకోనున్నారు.

కాగా అనంత్ అంబానీ వివాహ వేడుకకు హాజరయ్యేందుకు ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ శుక్రవారం ముంబై వెళ్లారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆహ్వానం అందడంతో హాజరయ్యారని తెలుస్తోంది. 

14న గ్రాండ్ రిసెప్షన్‌ ఏర్పాట్లు..
కొన్ని నెలలుగా అనంత్ అంబానీ – రాధికా మర్చంట్‌ల వివాహానికి సంబంధించిన వేడుకలు జరిగాయి. అనేక కార్యక్రమాలు నిర్వహించిన విషయం తెలిసిందే. శుక్రవారం రాత్రి పెళ్లి ఘట్టం ముగియడంతో ఇక విందు కార్యక్రమం ఒక్కటే మిగిలింది. ఇవాళ (శనివారం) ఎంపిక చేసిన కొంతమంది సన్నిహిత అతిథులకు విందు కార్యక్రమాన్ని సిద్ధం చేశారు. రేపు (ఆదివారం) గ్రాండ్ రిసెప్షన్‌ను ఏర్పాటు చేశారు.

Related posts

అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు

Ram Narayana

ఎవరెస్ట్ శిఖరం ఎక్కిన ఎస్ఆర్ఎమ్ యూనివర్సిటీ అధ్యాపకులు, విద్యార్థులు…

Ram Narayana

నెహ్రూ లేఖలను తిరిగిచ్చేయండి.. రాహుల్ గాంధీకి ‘ప్రైమ్ మినిస్టర్స్ మ్యూజియం’ లేఖ!

Ram Narayana

Leave a Comment