- ముచ్చుమర్రిలో బాలికపై హత్యాచారం
- అత్యాచారం చేసి బాలికను చంపేసిన మైనర్ బాలురు
- విధుల్లో నిర్లక్ష్యం ప్రదర్శించారంటూ సీఐ, ఎస్సైపై సస్పెన్షన్
నంద్యాల జిల్లా ముచ్చుమర్రి బాలిక హత్యాచారం కేసులో పోలీసు ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. కర్నూలు రేంజి డీఐజీ విజయరావు ఇద్దరు పోలీసుల అధికారులపై ససెన్షన్ వేటు వేశారు.
విధుల పట్ల నిర్లక్ష్యం, క్రమశిక్షణ ఉల్లంఘించారంటూ నందికొట్కూరు రూరల్ సీఐ విజయభాస్కర్, ముచ్చుమర్రి ఎస్సై జయశేఖర్ లను సస్పెండ్ చేశారు. విధుల పట్ల ఎవరైనా నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని డీఐజీ హెచ్చరించారు.
ముచ్చుమర్రిలో ఓ బాలికపై ముగ్గురు మైనర్ బాలురు అత్యాచారం చేసి, ఆపై గొంతు నులిమి హత్య చేయడం తెలిసిందే. ఈ విషయాన్ని బాలురు తమ పెద్దలకు తెలియజేయగా, అందులో ఓ బాలుడి తండ్రి, మరో బాలుడి పెదనాన్న బాలిక మృతదేహానికి రాళ్లు కట్టి కృష్ణా నదిలో విసిరేశారు.
ఈ ఘటనలో పోలీసులు ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. కృష్ణా నదిలో బాలిక మృతదేహం కోసం గాలింపు చేపట్టారు.