Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

అమెరికాలో గుంటూరు యువతి మృతి…

  • రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన హారిక
  • ఒక్లహామాలోని నేషనల్ హైవేపై ప్రమాదం
  • వెటర్నరీలో ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన విద్యార్థిని

ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన మరో తెలుగు విద్యార్థిని దుర్మరణం పాలైన ఘటన వెలుగుచూసింది. వెటర్నరీలో ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన ఏపీ యువతి రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందింది. ఒక్లహామాలోని నేషనల్ హైవేపై మూడు కార్లు ఢీకొన్న ప్రమాదంలో గుంటూరు జిల్లా తెనాలికి చెందిన హారిక అనే విద్యార్థిని ప్రాణాలు కోల్పోయింది. ఈ ప్రమాదంలో మరో ముగ్గురికి కూడా గాయాలయ్యాయి. బాధితులు చికిత్స పొందుతున్నారని తెలుస్తోంది.

కాగా హారిక మరణ వార్త విని తెనాలిలో ఆమె కుటుంబ సభ్యులు శోక సంద్రంలో మునిగారు. కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఏడాదిన్నర క్రితం ఆమె అమెరికా వెళ్లిందని తెలిపారు. హారిక మృతి చెందిన విషయాన్ని అక్కడి ఇండియన్ ఎంబసీకి తెలియజేశామని వెల్లడించారు. వీలైనంత త్వరగా హారిక మృతదేహాన్ని స్వస్థలానికి తీసుకొచ్చేందుకు చొరవ చూపాలని ప్రభుత్వాన్ని  విజ్ఞప్తి చేశారు.

Related posts

రోప్ వే ప్రమాదం.. తీగలపైనే 14 ప్రాణాలు.. కాపాడుతుండగా జారి పడిపోయిన ఒక వ్యక్తి

Drukpadam

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిటీ చైర్మన్ గా జనార్ధన్ రెడ్డి

Drukpadam

ఎన్నికలకు ముందు రాజస్థాన్ కాంగ్రెస్ అభ్యర్థి కన్నుమూత

Ram Narayana

Leave a Comment