రేపటి నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జరగనున్న నేపథ్యంలో, నేడు ఢిల్లీలో కేంద్ర అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ అధ్యక్షతన జరిగిన ఈ అఖిలపక్ష భేటీ ముగిసింది. పార్లమెంటు అనెక్స్ భవనంలో ఏర్పాటు చేసిన ఈ సమావేశం సుదీర్ఘ సమయం పాటు సాగింది.
రేపటి నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ఉన్నందున సహకారం అందించాలని కేంద్ర ప్రభుత్వం విపక్షాలను కోరింది. బడ్జెట్ తో పాటు, పార్లమెంటులో ప్రవేశపెట్టే బిల్లుల జాబితాను కూడా కేంద్రం విపక్షాలకు అందించింది.
కాగా, రేపు ప్రారంభం కానున్న పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో… విపక్షాలు నీట్ పరీక్ష వివాదం, మణిపూర్ హింస, ధరల పెరుగుదల, నిరుద్యోగం తదితర అంశాలపై చర్చకు పట్టుబట్టే అవకాశం ఉంది.