ఏపీ అసెంబ్లీ సమావేశాలు

అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసిన వైసీపీ ఎమ్మెల్యేలు…


ఏపీ అసెంబ్లీ సమావేశాల తొలి రోజే వైసీపీ సభ్యులు వాకౌట్ చేశారు. అసెంబ్లీ సమావేశాలు నేడు ప్రారంభం కాగా… జగన్ నాయకత్వంలోని వైసీపీ ఎమ్మెల్యేలు నల్ల కండువాలు ధరించి సభకు వచ్చారు. ఏపీలో అరాచక పాలన జరుగుతోందని, గత నెలన్నర రోజులుగా రాష్ట్రంలో హత్యలు, అఘాయిత్యాలు, దౌర్జన్యాలు పతాక స్థాయికి చేరాయంటూ వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో నిరసన తెలియజేశారు. 

అనంతరం, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలంటూ నినాదాలు చేసి, అసెంబ్లీ నుంచి బయటికి వచ్చేశారు. జగన్ తదితర ఎమ్మెల్యేలు బయటికి వచ్చేస్తున్న వీడియోను వైసీపీ తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకుంది. అటు, వైసీపీ ఎమ్మెల్సీలు కూడా తమ అధినేత బాటలోనే నడిచారు. సభ నుంచి వెలుపలికి వచ్చేశారు.

Related posts

బాలకృష్ణకు ఫస్ట్ వార్నింగ్ ఇచ్చిన అసెంబ్లీ స్పీకర్.. కోటంరెడ్డి, అనగాని సస్పెన్షన్

Ram Narayana

మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందే: అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసిన తర్వాత మీడియాతో బొత్స!

Ram Narayana

అంబటి రాంబాబు తల్లిని తిడితే ఒకటి… మీ తల్లిని అంటే ఒకటా?: బొత్స సత్యనారాయణ

Ram Narayana