- లిఖితపూర్వక షార్ట్ నోట్ సమర్పించాలని హైకోర్టు ఆదేశాలు
- తదుపరి విచారణ అక్టోబర్ 29కి వాయిదా
- 2021 ఫిబ్రవరి 11న ఈ కేసులో హైకోర్టును ఆశ్రయించిన స్వామి
నేషనల్ హెరాల్డ్ కేసులో నివేదించిన అంశాలపై లిఖితపూర్వక షార్ట్ నోట్ దాఖలు చేయాలని బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామిని, కాంగ్రెస్ అగ్రనాయకులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. వాదనలపై నాలుగు వారాల్లో లిఖితపూర్వక నోట్ దాఖలు చేయాలని జస్టిస్ నీనా బన్సల్ కృష్ణ వీరిని ఆదేశించారు.
నేషనల్ హెరాల్డ్ కేసుపై ఢిల్లీ హైకోర్టు సోమవారం విచారణ జరిపింది. లిఖిత పూర్వక నోట్ దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేసి, తదుపరి విచారణను అక్టోబర్ 29కి వాయిదా వేసింది. ఈ కేసులో నిందితులను ప్రాసిక్యూట్ చేయడానికి తనను అనుమతించాలని సుబ్రమణ్యస్వామి దాఖలు చేసిన పిటిషన్‌ను ట్రయల్ కోర్టు కొట్టివేసింది. దీంతో 2021 ఫిబ్రవరి 11న సుబ్రమణ్యస్వామి హైకోర్టును ఆశ్రయించారు.
దీంతో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి ఆస్కార్ జార్జ్ ఫెర్నాండెజ్(మరణించారు), సుమన్ దుబే, శామ్ పిట్రోడా, యంగ్ ఇండియాలకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది.