Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

ఇష్టంలేని పెళ్లి కొడుకులా అసెంబ్లీలో కేసీఆర్… కాంగ్రెస్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి

ఇన్నాళ్లకు అసెంబ్లీకి వచ్చిన కేసీఆర్ ఇష్టంలేని పెళ్లి కొడుకులా సభలో కూర్చున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ఎద్దేవా చేశారు. బడ్జెట్ ప్రసంగం అనంతరం ఆయన మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ… మీడియా పాయింట్‌ను బహిష్కరించిన కేసీఆరే… ఇప్పుడు అక్కడకు వచ్చి మాట్లాడారన్నారు. బడ్జెట్ బాగుందని, కానీ కేసీఆర్ చూడకుండానే విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.

బడ్జెట్ అంకెలను చూడలేదని… చదవకుండా ఊకదంపుడు ఉపన్యాసం ఇచ్చి వెళ్లారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం మైనార్టీలకు రూ.11 వేల కోట్లు మాత్రమే ఖర్చు చేసిందని… కానీ తాము ప్రాధాన్యత ఇచ్చామన్నారు. ఆరు గ్యారెంటీలను అమలు చేసేందుకు బడ్జెట్‌లో నిధులు కేటాయించినట్లు చెప్పారు.

కష్టకాలంలో, సంక్షోభ సమయంలో ఇలాంటి బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం సాహసోపేత నిర్ణయమని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. రైతు సంక్షేమానికి పెద్ద పీట వేశారన్నారు. అయితే, విద్య, వైద్య రంగానికి సరైన కేటాయింపులు జరగలేదని విమర్శించారు. భవిష్యత్తులో అయినా విద్య, వైద్య రంగాలకు నిధులు కేటాయించాలన్నారు. అసంఘటిత కార్మికులను ఆదుకోవాల్సిన బాధ్యత ఉందన్నారు. ప్రస్తుత సంక్షోభానికి గత ప్రభుత్వం చేసిన అప్పులే కారణమని విమర్శించారు. మంచి బడ్జెట్‌ను ప్రవేశపెట్టినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

Related posts

గత ప్రభుత్వాల పాపాలకు నేటి ప్రతిపక్ష నేతలదే బాధ్యత: రేవంత్ రెడ్డి

Ram Narayana

తెలంగాణ శాసనసభలో పవర్ పాయింట్ ప్రజంటేషన్ …తమకు అవకాశం ఇవ్వాలన్న బీఆర్ యస్

Ram Narayana

తెలంగాణలో ప్రభుత్వం ఎప్పుడు కూలుతుందా? అని బీజేపీ చూస్తోంది: బీవీ రాఘవులు

Ram Narayana

Leave a Comment