Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

 మచిలీపట్నంలో మత్స్యకారుల వలకు భారీ సొర!

  • మచిలీపట్నం వద్ద మత్స్యకారుల వలలో 1.5 టన్నుల సొరచేప
  • అతి కష్టమ్మీద ఒడ్డుకు చేర్చిన మత్స్యకారులు
  • మచ్చల సొర చేపను కొనుగోలు చేసిన చెన్నై వ్యాపారులు

మచిలీపట్నం వద్ద సముద్రంలో మత్స్యకారుల వలకు ఓ భారీ సొర చేప చిక్కింది. దీని బరువు ఒకటిన్నర టన్నులు ఉంది. దీన్ని మచ్చల సొర అని పిలుస్తారు. గిలకలదిండి వద్ద స్థానిక మత్స్యకారులు దీన్ని ఒడ్డుకు తీసుకువచ్చేందుకు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. ఓ క్రేన్ సాయంతో దీన్ని వెలుపలికి తీసుకువచ్చారు. చెన్నైకి చెందిన వ్యాపారులు ఈ భారీ సొర చేపను కొనుగోలు చేశారు. ఈ తరహా సొర చేపలు తీరానికి చేరువగా రావడం చాలా అరుదు. ఒక్కోసారి ఇతర చేపలను వేటాడుతూ ఇవి తీరాలకు దగ్గరగా వస్తుంటాయి. అలాంటి సమయాల్లోనే మత్స్యకారుల వలలకు చిక్కుతుంటాయి.

Related posts

జగన్ బెయిలు రద్దవుతుందంటూ కథనం.. విచారణ వాయిదా వేసిన సిబిఐ కోర్టు….

Drukpadam

టీడీపీ నేత పట్టాభిని విజయవాడ కోర్టులో హాజరుపర్చిన పోలీసులు… 14 రోజుల రిమాండ్ విధించిన న్యాయస్థానం!

Drukpadam

ధరల పెరుగుదల వార్తల నేపథ్యంలో.. భారీగా పెరిగిన ఈవీ-టూ వీలర్ల అమ్మకాలు…

Drukpadam

Leave a Comment