Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల…

  • ఈ నెల 13 వరకు నామినేషన్ల స్వీకరణ
  • ఈ నెల 14 నుంచి 16 వరకు నామినేషన్ల ఉపసంహరణ
  • ఈ నెల 30న పోలింగ్… సెప్టెంబరు 3న ఓట్ల లెక్కింపు
  • ఇప్పటికే బొత్సను అభ్యర్థిగా ప్రకటించిన వైసీపీ
  • త్వరలోనే కూటమి అభ్యర్థిని ప్రకటించనున్న సీఎం చంద్రబాబు

విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానం ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 13 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. ఈ నెల 14 నుంచి 16వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉంటుంది. ఈ నెల 30న ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ జరగనుంది. సెప్టెంబరు 3న కౌంటింగ్ చేపట్టనున్నారు. 

విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఉన్న చెన్నుబోయిన వంశీకృష్ణ వైసీపీని వీడి, ఇటీవల పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేనలో చేరారు. వంశీకృష్ణపై వైసీపీ ఫిర్యాదు చేసిన నేపథ్యంలో, మండలి చైర్మన్ అనర్హత వేటు వేసిన సంగతి తెలిసిందే. దాంతో విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహిస్తున్నారు. 

వైసీపీ అభ్యర్థిగా ఇప్పటికే మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ పేరును జగన్ ప్రకటించారు. కూటమి అభ్యర్థి ఎవరన్నది ఇంకా నిర్ణయం కాలేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు కూటమి నేతలతో చర్చించి దీనిపై ప్రకటన చేసే అవకాశాలున్నాయి.

Related posts

లోన్ కోసం వెళ్లిన వ్యక్తికి షాక్.. ఒకే పేరుతో 38 అకౌంట్లు!

Drukpadam

కాబూల్ దృశ్యాలు మనసును కలచివేశాయి : సినీ నటుడు సత్యదేవ్ -ఆఫ్ఘన్ల భద్రత కోసం ప్రార్థిస్తున్నా!

Drukpadam

తెలంగాణ ఎంపీలు, ఎమ్మెల్యేలపై కేసుల వివరాలు సుప్రీంకోర్టుకు!

Drukpadam

Leave a Comment