Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
అంతర్జాతీయం

బంగ్లాదేశ్ పాలనా బాధ్యతలు చేపట్టిన నోబెల్ గ్రహీత మహ్మద్ యూనస్…

  • బంగ్లాదేశ్ లో ప్రజా ఆగ్రహ జ్వాలలు
  • ప్రధాని పదవికి రాజీనామా చేసి భారత్ చేరుకున్న షేక్ హసీనా
  • విద్యార్థి సంఘాల కోరిక మేరకు బంగ్లాదేశ్ పాలకుడిగా మహ్మద్ యూనస్
  • ప్రజలకు భద్రత కల్పించే పాలన అందిస్తామని వెల్లడి

గత కొన్ని వారాలుగా నిరసన జ్వాలలతో అట్టుడికిన బంగ్లాదేశ్ లో తాజాగా మధ్యంతర ప్రభుత్వం ఏర్పడింది. విద్యార్థి సంఘాల కోరిక మేరకు నోబెల్ గ్రహీత మహ్మద్ యూనస్ బంగ్లాదేశ్ పాలనా పగ్గాలు చేపట్టారు. ఈ సందర్భంగా మహ్మద్ యూనస్ మాట్లాడుతూ, బంగ్లాదేశ్ ప్రజలకు భద్రత కల్పించే పాలన అందిస్తామని తెలిపారు. 

విద్యార్థుల పోరాటంతో బంగ్లాదేశ్ కు మరోసారి స్వాతంత్ర్యం వచ్చిందని అన్నారు. వచ్చిన స్వాతంత్ర్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఉందని యూనస్ స్పష్టం చేశారు. దేశ పునర్ నిర్మాణంలో విద్యార్థులు అండగా ఉండాలని, బంగ్లాదేశ్ లో శాంతియుత పరిస్థితులు నెలకొనేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. 

“బంగ్లాదేశ్ లో మొదట శాంతియుత పరిస్థితులు నెలకొల్పాలి… అందుకోసం ప్రజలంతా కృషి చేయాలి… దేశంలో ఎక్కడా ఎవరిపైనా దాడులు జరగకుండా చూడాలి. దయచేసి ఎక్కువ మంది శత్రువులను సృష్టించవద్దు” అని యూనస్ పేర్కొన్నారు.

Related posts

క్యాన్స‌ర్ బాధితుడికి జాక్‌పాట్.. రూ. 10వేల కోట్ల లాట‌రీ!

Ram Narayana

పాకిస్థాన్ లో అదుపుతప్పి లోయలో పడ్డ‌ బస్సు.. 28 మంది మృత్యువాత‌!

Ram Narayana

జపాన్ లో బియ్యం కొరత.. సూపర్ మార్కెట్లలో నో స్టాక్ బోర్డులు…

Ram Narayana

Leave a Comment