జాతీయ వార్తలు

కేరళ సీఎం విజయన్ ను కలిసి రూ.1 కోటి చెక్ అందించిన చిరంజీవి… !

  • వాయనాడ్ జిల్లాలో విరిగిపడిన కొండచరియలు
  • 400 మందికి పైగా మృత్యువాత
  • రూ.1 కోటి విరాళం ప్రకటించిన చిరంజీవి, రామ్ చరణ్
  • ప్రత్యేక విమానంలో నేడు కేరళ వెళ్లిన చిరంజీవి

కేరళలోని వాయనాడ్ జిల్లాలో ప్రకృతి ప్రకోపం కారణంగా 400 మందికి పైగా మృత్యువాతపడడం తెలిసిందే. వాయనాడ్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడిన ఘటనలో వందలాది మంది గల్లంతు కావడం అందరినీ కదలించింది. 

ఈ క్రమంలో టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, ఆయన తనయుడు, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కూడా ఈ విపత్తులో జరిగిన ప్రాణనష్టం పట్ల చలించిపోయారు. ఇరువురు కేరళ సీఎం రిలీఫ్ ఫండ్ కు రూ.1 కోటి విరాళం ప్రకటించారు. 

ఈ నేపథ్యంలో చిరంజీవి నేడు ప్రత్యేక విమానంలో కేరళ వెళ్లారు. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ను కలిసిన చిరంజీవి రూ.1 కోటి చెక్ ను ఆయనకు అందించారు. ఈ సందర్భంగా చిరంజీవికి సీఎం విజయన్ ధన్యవాదాలు తెలిపారు.

Related posts

హెల్త్, లైఫ్ ఇన్స్యూరెన్స్ ప్రీమియంపై జీఎస్టీ తగ్గింపుపై తదుపరి భేటీలో నిర్ణయం?

Ram Narayana

అహ్మదాబాద్‌ విమాన ప్రమాదం .. మృత్యుంజయుడిని పరామర్శించిన ప్రధాని మోదీ

Ram Narayana

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన శ్రీరాముడి విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ!

Ram Narayana