Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
అంతర్జాతీయంప్రమాదాలు ...

బ్రెజిల్‌లో ఘోర విమాన ప్రమాదం.. 62 మంది దుర్మరణం…

  • నిన్న విన్హెడో టౌన్ సమీపంలోని అటవీ ప్రాంతంలో కుప్పకూలిన విమానం
  • విమానంలోని వారందరూ మరణించినట్టు అధికారుల ప్రకటన
  • ఘటనపై విచారం వ్యక్తం చేసిన దేశాధ్యక్షుడు లూలా డ సిల్వా

బ్రెజిల్‌లో శుక్రవారం ఘోర విమాన ప్రమాదం సంభవించింది. 62 మంది ప్రయాణికులతో వెళుతున్న ఓ విమానం సావో పువాలోలోని విన్హెడో టౌన్ సమీపంలో కూలిపోవడంతో విమానంలోని వారందరూ దుర్మరణం చెందారు. కాస్కావెల్ నుంచి గ్వారుల్హోస్‌కు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. విమానం దట్టమైన అడవిలో అకస్మాత్తుగా కూలిపోవడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

ఈ ఘటనలో విమానంలోని వారందరూ మరణించారని, ఓ ఇల్లు కూడా ధ్వంసమైందని అధికారులు తెలిపారు. అయితే, స్థానికులు ఎవరికీ ప్రాణాపాయం జరగలేదని అన్నారు. ప్రమాదం విషయం తెలియగానే ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక, అత్యవసర సిబ్బంది సహాయక చర్యలు ప్రారంభించారు. 

విమాన ప్రమాదంపై దేశాధ్యక్షుడు లూలా డ సిల్వా విచారం వ్యక్తం చేశారు. విమానంలోని వారందరూ మృతి చెందారని తెలిపారు. ఈ ఘటనపై విమానయాన సంస్థ ఎటువంటి ప్రకటనా చేయలేదు.

Related posts

భారతీయ విద్యార్థిని ఆచూకీ చెబితే రూ.8.32 లక్షల రివార్డు.. అమెరికా ఎఫ్‌బీఐ ప్రకటన

Ram Narayana

హత్య కేసులో.. బ్రిటన్‌లో నలుగురు భారత సంతతి వ్యక్తులకు జీవితకాల జైలు శిక్ష…

Ram Narayana

మమ్మల్ని ఎవరూ బెదిరించడాన్ని అనుమతించేది లేదు: మాల్దీవుల అధ్యక్షుడి హెచ్చరిక

Ram Narayana

Leave a Comment