Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ వార్తలు

ఆగస్టు 15 హిస్టారికల్ డే …సీతారామ ప్రాజెక్ట్ పంపు హౌస్ లు ప్రారంభం …2 లక్షల రుణమాఫీ

రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం గత 10 సంవత్సరాల పాలనలో ఇరిగేషన్ ప్రోజెక్టుల కోసం లక్షా 81 వేల కోట్లు ఖర్చు చేసి నాణ్యత లేని ప్రాజెక్టులు నిర్మించి మోసం చేసిందని రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు …ఆగస్టు 15 న సీఎం రేవంత్ రెడ్డి చేస్తుల మీదగా ప్రారంభించనున్న సీతారామ ప్రాజెక్ట్ పంపు హౌస్ ల ట్రయిల్ రన్ పరిశీలించేందుకు ఆదివారం రాష్ట్ర రెవెన్యూ , హోసింగ్ , ఐ అండ్ పిఆర్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కలిసి ప్రత్యేక హెలికాఫ్టర్ ద్వారా జిల్లాకు వచ్చిన ఉత్తమ్ కుమార్ రెడ్డి బీఆర్ యస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అవకతవకలు ప్రస్తహించారు … వైరాలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి ,పొంగులేటి మాట్లాడుతూ తాము అధికారంలోకి వచ్చిన తర్వాతనే ఇరిగేషన్ ప్రాజెక్టులపై శ్రద్ధపెట్టమని అన్నారు …ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10 లక్షల ఎకరాలు నీరు ఇచ్చే సీతారామ ప్రాజెక్ట్ కు 8 వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన బీఆర్ యస్ ప్రభుత్వం ఒక్క ఎకరాకు నీరు ఇవ్వలేదని పంపు హౌస్ లను పరిశీలించలేదని విమర్శించారు … తాము వచ్చిన తర్వాతనే సీతారామ ప్రాజెక్ట్ కు కేంద్రం నుంచి అన్ని అనుమతులు తీసుకోని వచ్చామని అన్నారు ..ఆగస్టు 15 న సీఎం రేవంత్ రెడ్డి జిల్లాకు వచ్చి సీతారామ పంపు హౌస్ లను ప్రారంభిస్తారని ,ఎన్నెస్పీ కి అనుసంధానంగా నిర్మించిన రాజీవ్ కెనాల్ ప్రారంభించటం జరుగుతుందని అన్నారు …ఈ కార్యక్రమం అనంతరం వైరాలో జరిగే భారీ బహిరంగసభలో ఎన్నికల్లో వాగ్దానం చేసిన విధంగా రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ పత్రాలను సీఎం చేతుల మీదగా రైతులకు అందివ్వడం జరుగుతుందని తెలిపారు …

సీతారామ ప్రాజెక్ట్ కు హై ప్రయారిటీ …ఎన్ని నిధులైనా ఖర్చు పెడతాం ..

రాష్ట్ర ప్రభుత్వానికి సీతారామ ప్రాజెక్ట్ హైప్రయార్టీ అని, దీని నిర్మాణం కోసం ఎన్ని వేల కోట్లు అయినా ఖర్చు పెడతామని ఇరిగేషన్ మంత్రి అన్నారు …2026 నాటికీ ప్రాజెక్ట్ పూర్తీ చేసే లక్ష్యంతో ఉన్నామని అందుకు అవసరమైన భూములు ఇచ్చేందుకు రైతులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు … నాగార్జున సాగర్ కు ఇక్కడ భూములు చివరి ఆనందున ఎన్నెస్పీ ద్వారా నీళ్లు అందకుంటే గోదావరి నీళ్లను రాజీవ్ కెనాల్ ద్వారా ఎన్నెస్పీ కెనాల్ కు ఇచ్చేందుకు కృష్ణ ,గోదావరి కాలువలను అనుసంధానం చేసినట్లు మంత్రి వివరించారు ..ఆగస్టు 15 న సీఎం రేవంత్ రెడ్డి ,డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క , జిల్లా ఇంచార్జి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిలు మూడు పంపు హౌస్ లను ప్రారంభిస్తారని తెలిపారు ..మీడియా సమావేశంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి , వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తదితరులు పాల్గొన్నారు …

Related posts

తార్నాకలో మహిళపై గ్యాంగ్ రేప్

Ram Narayana

పాలమూరు బిడ్డనై ఉండి ప్రాజెక్టులు పూర్తి చేయకపోతే ప్రజలు నన్ను క్షమించరు: రేవంత్ రెడ్డి

Ram Narayana

కాంగ్రెస్ నేత‌లు, మంత్రులు మాట్లాడేట‌ప్పుడు జాగ్ర‌త్త‌గా ఉండాలి” అని మ‌హేశ్ కుమార్ గౌడ్!

Ram Narayana

Leave a Comment