Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఖమ్మం వార్తలు

వైద్యంపై *ప్రభుత్వ నిర్లక్ష్యం…సిపిఎం ధ్వజం

వైద్యంపై *ప్రభుత్వ నిర్లక్ష్యం…సిపిఎం ధ్వజం

  • హై రిస్క్ జోన్ గా ప్రకటించినా మారని తీరు
  • ప్రభుత్వ ఆస్పత్రుల్లో పర్మినెంట్ వైద్యుల నియమించాలి..
  • జిల్లాలో అధికారికంగా 300.. అనధికారికంగా వెయ్యికి పైగా జ్వర పీడితులు
  • పారిశుద్ధ్య కార్మికులను ప్రభుత్వం పట్టించుకోకపోవడమే *జ్వరాలకు కారణం
  • తక్షణం వైద్యశిబిరాలు ఏర్పాటు చేయాలి.. పారిశుద్ధ్యం మెరుగుపరచాలి
    *మీడియా సమావేశంలో సీపీఐ (ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు వైద్యంపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని, ఫలితంగానే జిల్లాలో విషజ్వరాలు విజృంభిస్తున్నాయని సీపీఐ (ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు ఆందోళన వ్యక్తం చేశారు. హైదరాబాద్ తర్వాత జిల్లాలోనే అత్యధిక డెంగీ కేసులు నమోదవుతున్నా.. హైరిస్క్ జోన్ గా ప్రకటించినా ప్రభుత్వం ఆ స్థాయిలో వైద్య సేవలు అందించడం లేదని మండిపడ్డారు. పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు యర్రా శ్రీకాంత్ తో కలిసి ఖమ్మంలోని సుందరయ్య భవనంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నున్నా నాగేశ్వరరావు మాట్లాడారు. ఏడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో 12 వేల నమూనాలు సేకరిస్తే 300 మందికి డెంగ్యూ జ్వరముగా నిర్ధారణ అయిందన్నారు. కానీ అనధికారికంగా వెయ్యికి పైగా కేసులు నమోదవుతున్నాయని తెలిపారు. ఆదివాసీ గ్రామాలు, తండాలు, ఊళ్ళకు ఊళ్ళు జ్వరాల బారిన పడుతున్నాయన్నారు. అనేకమంది ప్రైవేటు వైద్యశాలల్లో చికిత్స పొందుతున్నారని తెలిపారు. కూసుమంచి మండలం కేశవాపురం, రఘునాథపాలెం లోని వేపకుంట్ల, తిరుమలాయపాలెం తదితర మండలాల్లో ఊరంతా జ్వర పీడితులే ఉన్నట్లు వివరించారు.
  • మందులు, సిబ్బంది కొరత..

ప్రభుత్వ వైద్యశాలల్లో మందులు, సిబ్బంది కొరత తీవ్రంగా ఉందన్నారు. చాలా హాస్పిటల్స్ లో కాంట్రాక్టు డాక్టర్స్ ను నియమించడంతో పీజీ, పై చదువుల నిమిత్తం దీర్ఘకాలిక సెలవులు పెట్టడం, ఉద్యోగాలకు రాజీనామా చేయడం తదితర కారణాలతో వైద్యుల కొరత ఏర్పడుతున్న నేపథ్యంలో శాశ్వత ప్రాతిపదికన డాక్టర్లను నియమించాలని కోరారు. కొన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో కనీసం మంచినీటి సౌకర్యం కూడా లేదన్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఎమ్మెల్యేగా ఉన్న మధిర నియోజకవర్గ కేంద్రంలో వంద పడకల ఏరియా ఆసుపత్రి నిర్మించి రెండు నెలలు అవుతున్నా దానిని ప్రారంభించలేదన్నారు. ప్రస్తుతం ఉన్న ఆసుపత్రిలో పెచ్చులూడి పడుతున్నాయని తెలిపారు. ఈ ఆస్పత్రిలో ఆరుగురు డాక్టర్లు ఉండగా… 24 గంటల పాటు పనిచేయాల్సి ఉంటే.. సాయంత్రం కాగానే డాక్టర్లు ఎవరూ ఉండటం లేదని ఆరోపించారు. స్థానిక ఇటుక బట్టీలలో పనిచేసే ఆదివాసీ మహిళ మొన్న ఈ ఆసుపత్రికి వస్తే నర్సే కాన్పు చేసినట్లు చెప్పారు. ఆరుగురు డాక్టర్లు ఉంటే నర్సు వైద్యం చేయాల్సి వచ్చిందంటే.. వైద్య ఆరోగ్య శాఖ నుంచి పర్యవేక్షణ లోపమే కారణమని తెలిపారు. ప్రభుత్వ వైద్యశాలల్లో సౌకర్యాల లేమితో జ్వరానికి ప్రయివేటుగా వైద్యం చేయించుకుంటే రూ. 20వేల నుంచి రూ. లక్షలు ఖర్చు చేయాల్సి వస్తుందన్నారు.

  • వెంటాడుతున్న పారిశుధ్య సమస్య

అనేక గ్రామాలు, ఆసుపత్రుల్లో పారిశుద్ధ్య సమస్య వెంటాడుతోందన్నారు. ఖమ్మం కార్పొరేషన్ లో 500 మంది అదనపు పారిశుద్ధ్య కార్మికులను నియమించాల్సి ఉందన్నారు. చాలా పంచాయతీలలో వర్కర్లకు మూడు నెలలుగా వేతనాలు ఇవ్వడం లేదని చెప్పారు. బ్లీచింగ్ కూడా చేయటం లేదని తెలిపారు. మొన్నటి బడ్జెట్లో వైద్యానికి నిధులు తగ్గించిన విషయాన్ని ప్రస్తావించారు. ప్రభుత్వం, ప్రతిపక్షాలు పరస్పరం ఆరోపణలు చేసుకోవడం మినహా ప్రజా సమస్యలపై దృష్టి సారించడం లేదని ఆరోపించారు.

  • హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలి..

హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించి ఊరూరా వైద్య శిబిరాలు నిర్వహించాలని నున్నా నాగేశ్వరరావు కోరారు. అదనపు సిబ్బందిని ఏర్పాటు చేసి మందుల కొరత లేకుండా చూడాలన్నారు. గ్రామపంచాయతీ సిబ్బంది, ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులకు మూడు నెలల జీతాలు తక్షణం విడుదల చేయాలని కోరారు.

Related posts

బీ.అర్.ఎస్ పార్టీకి షాక్..రఘునాథపాలెం సర్పంచ్ పార్టీకి గుడ్ బై…

Ram Narayana

జిల్లాలో మంత్రులు ,తుమ్మల , పొంగులేటి పర్యటనలు

Ram Narayana

తిర్మలాయపాలెం ప్రభుత్వ ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి అందుబాటులో లేని సిబ్బంది పై ఆగ్రహాం…

Ram Narayana

Leave a Comment