టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వర్‌రావు ఇళ్లు, కార్యాలయాల్లో ఈడీ సోదాలు…
మధుకాన్ గ్రూప్ సంస్థల్లో తనిఖీలు
మరో ఐదు ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు
రుణాల పేరుతో బ్యాంకులను మోసం చేసినట్లు ఆరోపణలు
టీఆర్ఎస్ కు చెందిన ఖమ్మం ఎంపీ, లోకసభలో టీఆర్ యస్ పక్షనేత నామా నాగేశ్వర్‌రావుకు చెందిన కార్యాలయాలు, ఇళ్లలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు శుక్రవారం దాడులు చేశారు ఏకకాలంలో జరిగిన ఈ ఖమ్మంలోని మధుకాన్ కార్యాలయంతోపాటు ఇతర గ్రూప్ సంస్థలలో ఏకకాలంలో ఈ దాడులు జరిగాయి. మధుకాన్ గ్రూప్ సంస్థలతో పాటు మరో ఐదు ప్రాంతాల్లో ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి . రుణాల పేరుతో బ్యాంకులను మోసం చేసినట్లు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు.
మధుకాన్ డైరెక్టర్ల ఇళ్లలోనూ సోదాలు కొనసాగుతున్నాయి. రాంకీ ఎక్స్‌ప్రెస్ హైవే ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో తీసుకున్న రుణాలను దారి మళ్లించారనే అభియోగాలపై తనిఖీలు జరుగుతున్నాయి. ఆ సంస్థల బ్యాంకు ఖాతాలు, డాక్యుమెంట్లు, కాంట్రాక్టులకు సంబంధించిన వివరాలను అధికారులు అడుగుతున్నారు.ఇవి సాధనంగా జరిగే దాడులే అని కొట్టిపారేస్తున్న దీనిపై పూర్తీ వివరాలు అందాల్సిఉంది.