Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

శరద్​ పవార్​ తో ప్రశాంత్​ కిషోర్​ భేటీ.. ‘మిషన్​ 2024’పై మంతనాలు!

శరద్​ పవార్​ తో ప్రశాంత్​ కిషోర్​ భేటీ.. ‘మిషన్​ 2024’పై మంతనాలు!
-ఎన్సీపీ చీఫ్ ఇంట్లో భోజనం
-కూటమి ప్రధాని అభ్యర్థిపై చర్చ
-స్నేహపూర్వక భేటీనే అంటున్న పీకే సన్నిహితులు

పశ్చిమ బెంగాల్ గెలుపు జోష్ లో ఉన్న ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్.. ఇవ్వాళ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధినేత శరద్ పవార్ తో సమావేశమయ్యారు. ముంబై లోని ఎన్సీపీ చీఫ్ అధికారిక నివాసమైన సిల్వర్ ఓక్ లో ఆయనతో కలసి భోజనం చేసిన ప్రశాంత్ .. 2024 ఎన్నికలకు సంబంధించిన అంశాలపై మాట్లాడినట్టు తెలుస్తోంది. బెంగాల్, తమిళనాడుల్లో విజయానికి సహకరించినందుకు కృతజ్ఞతపూర్వకంగానే ఆయన కలిశారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఈ సందర్భంగా 2024 ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికలు , ప్రతిపక్షాల ఐక్యత ఉమ్మడి ప్రధాని అభ్యర్థి విషయాలు కూడా చర్చకు వచ్చినట్లు ప్రచారం జరుగుతుంది.

మిషన్ -24 లో భాగంగానే ప్రశాంత కిషోర్ దేశంలోనే అత్యంత కీలక నాయకుడుగా పేరున్న శరద్ పవర్ తో ప్రత్యేకంగా సమావేశం అయ్యేందుకు ముంబై కి వచ్చినట్లు తెలుస్తుంది. బెంగాల్ , తమిళనాడు ఎన్నికల వ్యూహకర్తగా పనిచేసిన ప్రశాంత్ కిషోర్ ఆ ఎన్నికల్లో సహకరించిన నాయకులను అందరిని కలుస్తున్నారని ప్రచారం జరుగుతున్నప్పటికీ ఆయన మాస్టర్ ప్లాన్ లో భాగంగానే కలిసినట్లు రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు .

శరద్ పవార్ ఒక్కరినే కాకుండా.. ఇటీవలి ఎన్నికలలో మమత బెనర్జీ, ఎంకే స్టాలిన్ లకు మద్దతు ప్రకటించిన ప్రతి ఒక్కరిని ఆయన కలుస్తారని అంటున్నారు. అయితే, కృతజ్ఞతలు తెలపడంతో పాటు ‘మిషన్ 2024’కూ ఇప్పటి నుంచే ప్రణాళికలు రచిస్తున్నారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీకి దీటుగా పోటీకి నిలబెట్టేందుకు ‘కూటమి’ ప్రధాని అభ్యర్థి గురించి కూడా మాట్లాడుతున్నట్టు తెలుస్తోంది.

పశ్చిమ బెంగాల్ లో మమతా ఘన విజయం సాధిస్తారని ధీమాగా చెప్పిన ప్రశాంత్ కిషోర్ బీజేపీ కి రెండు అంకెలు దాటవని ఛాలంజ్ చేశారు. అదే జరిగితే తాను ఇక నుంచి ఎన్నికల వ్యూహకర్తగా పని చేయబోనని ప్రకటించారు. ఆయన చెప్పినట్లే జరిగింది. అయినప్పటికీ ఇక నుంచి ఎన్నికల వ్యూహాలతో పలు పంచుకొనని చెప్పిన ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ని ప్రకటిస్తే తాను పని చేస్తానని ప్రకటించడం సంచలనంగా మారింది.

శరద్ పవర్ తో సమావేశం తరువాత ప్రశాంత్ కిషోర్ ప్రముఖ బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్ ను కూడా కలవనున్నట్లు సమాచారం …..

Related posts

కొలువు తీరిన ఆఫ్ఘన్ తాత్కాలిక తాలిబన్ కొత్త ప్రభుత్వం!

Drukpadam

బద్వేల్ బాధ్యత మంత్రి పెద్దిరెడ్డికి …వైసీపీ అభ్యర్థిగా డాక్టర్ దాసరి సుధ!

Drukpadam

కౌశిక్‌రెడ్డికి షాక్… ఎమ్మెల్సీ పదవిపై డైలమా …

Drukpadam

Leave a Comment