గద్వాల పర్యటనలో మంత్రి జూపల్లి కృష్ణా రావు కాన్వాయ్‌పై రాళ్లదాడి?
సొంతపార్టీ కార్యకర్తల నుంచే ఆగ్రహం
తమకు సమాచారం ఇవ్వకుండానే జిల్లాకు రావడం ఏమిటని నిలదీత
ఇటీవల పార్టీలో చేరిన ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డికి మంత్రి వెళ్లడం నిరసన
ముందు తమ ఇంటికే రావాలని జిల్లా ఇంచార్జి తిరుపతి వర్గీయుల పట్టు
తెలంగాణ ఎక్జైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు కి సొంత పార్టీ నేతలు, కార్యకర్తలు నుంచే చేదు అనుభవం ఎదురైంది. శనివారం గద్వాల జిల్లాలో నీటి పారుదల ప్రాజెక్టుల పరిశీలనకు బయల్దేరిన మంత్రి జూపల్లి కృష్ణారావు కాన్వాయ్‌ని గద్వాల నియోజకవర్గం పరిధిలోని చింతలపేట వద్ద కాంగ్రెస్ పార్టీ గద్వాల జిల్లా ఇంచార్జ్ సరిత తిరుపతి వర్గీయులు అడ్డుకున్నారు.
అంతేకాదు.. రాళ్లదాడితో మంత్రి జూపల్లిపై తమ ఆగ్రహం వెళ్లగక్కారు. తమ కు సమాచారం ఇవ్వకుండా నే జిల్లా పర్యటనకు రావ డం ఏంటని?వాళ్లు మంత్రి జూపల్లిని నిలదీశారు.
తాము కాంగ్రెస్ పార్టీలో మొదటి నుంచికొనసాగు తున్నామని.. అలాంటిది తమకు చెప్పకుండా నిర్లక్ష్యం వహించి, ఇటీవల బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన గద్వాల ఎమ్మెల్యే కృష్ణ మోహన్‌కి ప్రాధాన్యత ఇవ్వడం ఏంటని సరిత వర్గీయులు మంత్రి జూపల్లితో వాగ్వాదానికి దిగారు.
జిల్లా ఇంచార్జ్‌కి సమాచారం ఇవ్వకుండా జిల్లా పర్యటన కు రావడమంటే అది తమని అవమానించి నట్టుగానే భావించాల్సి ఉంటుంది అని సరిత వర్గం నేతలు, కార్యకర్తలు మంత్రి జూపల్లిపై మండిపడ్డారు.
మంత్రి జూపల్లి కృష్ణారావు వారికి నచ్చజెప్పేందుకు ఎంత ప్రయత్నించినప్పటికీ సరిత వర్గం సంతృప్తి చెందలేదు. మంత్రి జూపల్లి ముందుగా తమ ఇంటికి రాకుండా ఎమ్మెల్యే కృష్ణ మోహన్ ఇంటికి వెళ్లడానికి వీల్లేదని మంత్రి కాన్వాయ్‌కి అడ్డుపడ్డారు.
తిరిగి వచ్చేటప్పుడు వస్తానని మంత్రి జూపల్లి ఎంత చెప్పినా వినలేదు. దీంతో చేసేదేం లేక మంత్రి జూపల్లి కృష్ణారావు తానే వెనక్కి తగ్గి అక్కడి నుండి సరిత ఇంటికి వెళ్లి వారితో భేటీ అవ్వాల్సిన పరిస్థితి నెలకొంది..