కెమెరాతో ఫోటో జర్నలిస్టులను క్లిక్ మనిపించిన మంత్రి పొంగులేటి…
టీయూడబ్ల్యూజే కార్యాలయాన్ని ఆసక్తిగా తిలకించిన మంత్రి
కార్యాలయ చరిత్రను మంత్రికి వివరించిన మీడియా అకాడమీ చైర్మన్ కె .శ్రీనివాస్ రెడ్డి
కార్యాలయం చాల బాగుందని ప్రసంశలు
వరల్డ్ ఫొటోగ్రఫీ డే సందర్భంగా రాష్ట్ర సమాచార ,రెవెన్యూ ,గృహనిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఫోటో జర్నలిస్టులను కెమెరాతో క్లిక్ మనిపించారు …ఈసన్నివేశం సరదాగా మారింది … ఫోటో జర్నలిస్టులు తమ కెమెరా మంత్రి చేతులో పెట్టి సార్ ఒక్కసారి ఫోటో తీయండని అనగానే వెంటనే కెమెరా తీసుకోని వారి గ్రూప్ ఫోటో తీయడం నవ్వులు పూవించింది … మంత్రి కూడా తన ఆనందాన్ని వ్యక్తం పరిచారు …
ఫోటో ఎగ్జిబిషన్ ప్రారంభించిన మంత్రి అక్కడ ప్రదర్శించిన ఫోటోలను ఆసక్తిగా పరిశీలించారు …ఫోటోలను గురించి అడిగితెలుసుకున్నారు …చాలాబాగా ఆర్గనైజ్ చేశారని నిర్వాహకులను అభినందించారు …ఒక్క ఫోటో అనేక విషయాలను తెలియజేస్తుందని అన్నారు .. ప్రపంచ ఫోటోగ్రఫీ డే సందర్భంగా రాష్ట్రంలో ఉన్న ఫోటో జర్నలిస్టలు శుభాకాంక్షలు తెలిపారు
రాష్ట్ర ఫోటో జర్నలిస్టుల సంఘం ఆహ్వానం మేరకు దేశోద్ధారక భవనం టీయూడబ్ల్యూజే (ఐజేయూ ) కార్యాలయానికి మొదటిసారిగా వచ్చారు …ఈ సందర్భంగా మంత్రి యూనియన్ ఆలిండియా అధ్యక్షులు ప్రెస్ అకాడమీ చైర్మన్ కె .శ్రీనివాస్ రెడ్డి , కార్యదర్శి వై .నరేందర్ రెడ్డి , టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్ష ,ప్రధాన కార్యదర్శులు కె .విరహత్ అలీ , కె . రాంనారాయణ , ఫోటో జర్నలిస్ట్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు అనిల్ , హరి లు మంత్రికి ఘనంగా స్వాగతం పలికారు … ఫోటో ఎగ్జిబిషన్ తిలకించిన అనంతరం యూనియన్ కార్యాలన్నీ సందర్చించారు ..కార్యాలయం ఎప్పుడు ఏర్పడింది , వివిధ అనుబంధ సంఘాలు ఇందులో ఎలా పనిచేస్తున్నది మంత్రికి మీడియా అకాడమీ చైర్మన్ కె.శ్రీనివాస్ రెడ్డి వివరించారు …ప్రత్యేకించి మొదటి అంతస్తులో ఉన్న మీటింగ్ హాల్ సురవరం ప్రతాప రెడ్డి ఆడిటోరియంను మంత్రి చాలాబాగుందన్నారు ..మరొకసారి కార్యాలయానికి వచ్చి జర్నలిస్ట్ మిత్రులతో గడిపి వారి సాదకబాధకాలను తెలుసుకుంటానని యూనియన్ నేతలకు హామీ ఇచ్చారు …చాలాకాలం తర్వాత రాష్ట్ర క్యాబినెట్ లో సమాచార శాఖకు మంత్రిని నియమించడం పట్ల సీఎం రేవంత్ రెడ్డికి జర్నలిస్ట్ నేతలు మరోసారి ధన్యవాదాలు తెలిపారు …