- సెప్టెంబర్ 6న వార్డుల వారీగా డ్రాఫ్ట్ ఓటరు జాబితా ప్రచురణ
- జాబితాపై సెప్టెంబర్ 7 నుంచి 13 వరకు అభ్యంతరాల స్వీకరణ
- సెప్టెంబర్ 21న వార్డుల వారీగా తుది జాబితా ప్రచురణ
తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. ఓటరు జాబితా తయారీకి రాష్ట్ర ఎన్నికల సంఘం బుధవారం షెడ్యూల్‌ను విడుదల చేసింది. సెప్టెంబర్ 6న ఆయా గ్రామపంచాయతీలలో వార్డుల వారీగా డ్రాఫ్ట్ ఓటరు జాబితాను ప్రచురిస్తారు. ఈ జాబితాపై సెప్టెంబర్ 7వ తేదీ నుంచి 13 వరకు అభ్యంతరాలను స్వీకరిస్తారు.
సెప్టెంబర్ 9, 10 తేదీలలో రాజకీయ పార్టీల నుంచి సూచనలు, సలహాలను స్వీకరిస్తారు. సెప్టెంబర్ 21న వార్డుల వారీగా తుది జాబితాను ప్రచురిస్తారు. ఈ నెల 29న ఓటరు జాబితా తయారీపై జిల్లాల కలెక్టర్లతో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తారు.