Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

మృతుల కుటుంబాలకు రూ. కోటి చొప్పున పరిహారం ప్రకటించిన చంద్రబాబు!

  • అచ్యుతాపురం ప్రమాద బాధితులను పరామర్శించిన చంద్రబాబు
  • ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం హామీ
  • వైసీపీ తప్పులు చేసి ప్రభుత్వాన్ని విమర్శిస్తోందని మండిపాటు

అచ్యుతాపురం సెజ్ లోని ఫార్మా కంపెనీ ప్రమాద బాధితులను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పరామర్శించారు. ఈరోజు విశాఖపట్నం చేరుకున్న ఆయన… నేరుగా మెడికవర్ ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. వారికి ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు. బాధితులు త్వరగా కోలుకునేలా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు. వైద్యులతో మాట్లాడి క్షతగాత్రులకు అందిస్తున్న చికిత్స వివరాలను తెలుసుకున్నారు. 

అనంతరం బాధితుల కుటుంబ సభ్యులతో చంద్రబాబు మాట్లాడారు. ఎవరూ భయపడొద్దని, ధైర్యంగా ఉండాలని ఆయన అన్నారు. ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. అనంతరం ఆసుపత్రి వెలుపల మీడియాతో మాట్లాడుతూ… ఫార్మా కంపెనీలో జరిగిన ప్రమాదం కలచివేసిందని చెప్పారు. మృతుల కుటుంబాలకు రూ. కోటి చొప్పున పరిహారం అందజేస్తామని తెలిపారు. తీవ్రంగా గాయపడిన వారికి రూ. 50 లక్షలు, స్వల్ప గాయాలైన వారికి రూ. 25 లక్షల చొప్పున పరిహారం అందిస్తామని చెప్పారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 60 రోజులు మాత్రమే అవుతోందని… ఈ ప్రమాదానికి ఎవరు కారణమని ప్రశ్నించారు. వైసీపీ తప్పులు చేసి… ఇప్పుడు తమ ప్రభుత్వాన్ని విమర్శిస్తోందని మండిపడ్డారు.

Related posts

వికారాబాద్ జిల్లాలో పొలాల్లో కూలిపోయిన వింత వస్తువు… !

Drukpadam

6 నుంచి ఏపీఎస్ ఆర్టీసీ సమ్మె.. నోటీసు ఇచ్చిన జేఏసీ…

Drukpadam

బిపిన్ రావత్ మరణం తీవ్ర వేదన కలిగిస్తోంది: ప్రధాని నరేంద్ర మోదీ

Drukpadam

Leave a Comment