Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ వార్తలు

హైడ్రా కూల్చివేతలపై తెలంగాణ బీజేపీ కీలక నిర్ణయం..!

  • పెద్దల అక్రమ కూల్చివేతలు ఓకే కానీ పేదల జోలికి వస్తే మాత్రం ఊరుకనేది లేదంటున్న బీజేపీ
  • అక్రమ కట్టడాలకు అనుమతిచ్చిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్
  • పేదలకు ప్రత్యామ్నాయం చూపాలన్న బీజేపీ

చెరువులు, నాలాల్లోని ఆక్రమణల కూల్చివేతలపై తెలంగాణ బీజేపీ కీలక నిర్ణయం తీసుకుంది. పెద్దపెద్దవారి అక్రమ కూల్చివేతలు ఒకే కానీ… పేదల జోలికి వస్తే మాత్రం ఊరుకునేది లేదని ఆ పార్టీ అంటోంది. హైడ్రా కూల్చివేతలపై బీజేపీ నేతలు సోమవారం కీలక సమావేశం నిర్వహించారు. రంగారెడ్డి, మేడ్చల్ అర్బన్, రూరల్ జిల్లాల అధ్యక్షులతో పాటు పలువురు సీనియర్ నేతలు పాల్గొన్నారు. హైడ్రా కూల్చివేతలపై వీరు చర్చించారు.

చెరువులు, నాలాలను ఆక్రమిస్తూ నిర్మించిన కట్టడాలకు అనుమతులు ఇచ్చిన అధికారులపై చర్యలు తీసుకోవాలని ఈ సమావేశంలో బీజేపీ డిమాండ్ చేసింది. ఎఫ్‌టీఎల్‌లో పట్టా భూములు ఉన్న పేదలకు ప్రత్యామ్నాయం చూపాలని పేర్కొంది. ప్రతిపక్షాలను టార్గెట్ చేస్తూ హైడ్రా కూల్చివేతలు జరిపితే ఊరుకునేది లేదని బీజేపీ హెచ్చరించింది. అయితే పెద్దవాళ్లు అక్రమంగా నిర్మించిన కూల్చివేతలను బీజేపీ సమర్థించింది. కానీ పేద, మధ్య తరగతి ఆస్తులను కూల్చివేస్తే న్యాయపోరాటానికి సిద్ధమవుతోంది.

సల్కం చెరువుపై బీజేపీ ట్వీట్

సల్కం చెరువులో అక్రమ నిర్మాణాలు చేపట్టారంటూ బీజేపీ ట్వీట్ చేసింది. 2012లో వ్యవసాయ భూమి ఉండగా, 2024లో ఒవైసీ ఆసుపత్రి వచ్చిందంటూ శాటిలైట్ ఇమేజ్‌లను జత చేసింది. బండ్లగూడ మండలం సల్కం చెరువును ఆక్రమించి ఒవైసీ సోదరులు ఫాతిమా మహిళా కాలేజీ నిర్మించారని ఆరోపించింది. ఈ నిర్మాణాలపై చర్యలు తీసుకునే ధైర్యం హైడ్రా చేయగలదా? అని ప్రశ్నించింది. 

Related posts

హైడ్రా పేరుతో బెదిరిస్తే జైలుకే.. రంగనాథ్ హెచ్చరిక!

Ram Narayana

కొత్త ప్రభాకర్ రెడ్డి ఆసుపత్రిలోనే 10 రోజులు ఉండాలి: యశోద ఆసుపత్రి వైద్యులు

Ram Narayana

టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ… తదుపరి పరిణామాలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష

Ram Narayana

Leave a Comment